Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొసలి శిరస్సుపై కోడిపుంజు... మొసలి నోటికి చిక్కిందా? లేదా?

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (22:22 IST)
సాధారణంగా మొసలిని చూస్తే ప్రతి ఒక్కరూ భయపడుతారు. ఆ మొసలి ఉండే నీటి కొలను దరిదాపులకు కూడా వెళ్లేందుకు జంకుతుంటారు. అయితే, ఒక కోడి మాత్రం ఏకంగా మొసలి తలపై ఎక్కి కూర్చొంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ప‌దంటే ప‌దే సెక‌న్ల నిడివిగ‌ల ఆ వీడియోలో ఒక మొస‌లి త‌న దేహాన్నీ మొత్తం న‌దిలోప‌లికి ఉంచి, కేవ‌లం త‌ల‌ను మాత్రమే ఒడ్డుకు పెట్టి నిద్రిస్తూ ఉంటుంది. అయితే, మొస‌లి ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలియ‌క దాన్ని ప‌డ‌వ‌లా ఉప‌యోగించుకుని న‌దిని దాటాల‌నుకున్న‌దో, లేదంటే మొస‌లి సంగ‌తి తెలిసి కూడా దానికి చిక్క‌కుండా త‌ప్పించుకోగ‌ల‌న‌న్న ఆత్మ‌విశ్వాస‌మో గానీ ఒక కోడి పుంజు దాని త‌ల‌పైకి ఎక్కింది. 
 
అదేస‌మ‌యంలో మ‌రో మొస‌లి న‌ది లోపలి నుంచి ఆ కోడి పుంజునే క‌నిపెడుతూ మెల్ల‌మెల్ల‌గా అటుగా క‌దులుతూ క‌నిపిస్తుంది. అలాంటి ప‌రిస్థితుల్లో ఎవ‌రైనా రెండు మొస‌ళ్ల‌లో ఏదో ఒక మొస‌లి కోడి పుంజును మింగ‌డం ఖాయం అనుకుంటారు. కానీ కోడి పుంజు మాత్రం ఏ మొస‌లి నోట ప‌డ‌కుండా చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంది. 
 
దీపాన్షు క‌బ్రా అనే అట‌వీశాఖ అధికారి పోస్ట్ చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మొస‌ళ్ల బారి నుంచి కోడిపుంజు త‌ప్పించుకున్న తీరుపై నెటిజ‌న్‌లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. మ‌రి ఆ కోడి పుంజు ఎలా త‌ప్పించుకుందో కింది వీడియోలో మీరూ ఒక‌సారి చూడండి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments