Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఇదే నా ఆఖరి టిక్‌టాక్‌ వీడియో' అంటూ విషం తాగి.. భర్తకు పంపింది..

Webdunia
గురువారం, 13 జూన్ 2019 (10:55 IST)
టిక్‌టాక్‌' మరొకరి ప్రాణాలను తీసింది. టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేస్తున్న భార్యను భర్త మందలించడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. చనిపోతూ వీడియో తీసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్‌ చేయడం సంచలనంగా మారింది. 
 
తమిళనాడులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. అరియలూరు జిల్లా సెందురైలోని వంగారం గ్రామానికి చెందిన అనిత(24)తో పళనివేలుకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది.

వీరికి ఇద్దరు పిల్లలు. పళనివేలు సింగపూర్‌లో పనిచేస్తుండగా ఇద్దరు పిల్లలతో అనిత పెరంబలూరులో ఉంటోంది. అనిత.. టిక్‌టాక్‌కు బానిసగా మారింది. నిత్యం పదుల సంఖ్యలో వీడియోలను అప్‌లోడ్‌ చేసేది. 
 
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం పిల్లలకు దెబ్బ తగిలి గాయపడ్డారు. అప్పుడు కూడా అనిత నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బంధువుల ద్వారా ఆ విషయం పళనివేలుకు తెలిసింది. పిల్లలకు దెబ్బలు తగిలినా పట్టించుకోకుండా టిక్‌టాక్‌లో వీడియోలు అప్‌లోడ్‌ చేయడమేంటంటూ ఫోన్‌ చేసి మందలించాడు. 
 
మనస్తాపం చెందిన అనిత 'ఇదే నా ఆఖరి టిక్‌టాక్‌ వీడియో' అని పేర్కొంటూ వీడియో తీస్తూ పురుగుల మందు తాగేసింది. ఆ వీడియోను అప్‌లోడ్‌ అయిన కొద్దిసేపటికే ఆమె మరణించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments