Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ మళ్లీ వచ్చేసింది... బిజీగా చేసేస్తున్నారు... కానీ...

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (14:31 IST)
టిక్ టాక్ యాప్‌ నిషేధంతో చాలామంది తీవ్రమైన అసహనం వెలిబుచ్చారు. తామంతా టిక్ టాక్‌తో తమాషా వీడియోలు చేసుకుని కాలక్షేపం చేస్తుంటామనీ, అలాంటి యాప్ పైన నిషేధం వేటు వేయడం ఏంటని విమర్శించారు. దానివల్లకానీ, మరి దేనివల్లనో కానీ టిక్ టాక్ పైన వున్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీనితో మళ్లీ నెటిజన్లు వీడియోలు చేసి షేర్లు చేసుకుంటున్నారు.
 
కాగా నిషేధం విధించిన చైనా యాప్‌ ‘టిక్‌టాక్‌’ను అనుమతిస్తున్నట్లు మద్రాసు హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ తమకు ఈ యాప్ ఇప్పటికీ గూగుల్‌ ప్లే స్టోర్, ఆపిల్‌ యాప్‌ స్టోర్లలో యూజర్లకు అందుబాటులో లేదు. దీనిపై కోర్టు నుంచి తమకు మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తాము ఆయా సంస్థలతో అధికారికంగా మాట్లాడతామని ఎలక్ట్రానిక్స్‌, సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖలోని ప్రతినిధులు మీడియాకు తెలియజేసారు. 
 
ఇలా ఉండగా ఈ యాప్‌పై తాము విధించిన నిషేధం కొనసాగుతుందని మద్రాసు హైకోర్టు ఇటీవల మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో ఏప్రిల్‌ 3న కేంద్ర ఐటీ శాఖ గూగుల్‌ ప్లే స్టోర్, ఆపిల్‌ ఐఓఎస్ స్టోర్‌లలో ఈ యాప్‌లు లభ్యం కాకుండా చేయాలని ఆయా సంస్థలకు సూచించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో ఆ రెండు యాప్‌ స్టోర్ల నుంచి ఇటీవలే ఈ యాప్‌ను తొలగించారు. 
 
స్మార్ట్‌ఫోన్‌లలో ప్రత్యేక ఫీచర్లతో యూజర్లు ఈ యాప్‌ ద్వారా వీడియోలను తీసుకునే వారు. వాటిని సోషల్ మీడియాలో షేర్‌ చేసేవారు. అయితే, వీడియో యాప్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని అభ్యంతరాలు వచ్చాయి. చిన్నారులను లక్ష్యంగా చేసుకుని లైంగిక నేరాలకు పాల్పడే అవకాశం ఉందని ఆరోపణలు వచ్చాయి.
 
టిక్‌టాక్‌ యాప్‌పై స్టే విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై తీర్పునివ్వాలంటూ మద్రాసు హైకోర్టుకు ఇటీవల సుప్రీంకోర్టు గడువు విధించింది. దీంతో చిన్నారులు, మహిళల అశ్లీల వీడియోలు అప్‌లోడ్‌ చేయకూడదనే ఆంక్షలతో ఈ యాప్‌పై ధర్మాసనం తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం