Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాది: ఐరాస, అలాగేనన్న చైనా

Webdunia
బుధవారం, 1 మే 2019 (20:02 IST)
ఉగ్రవాద కార్యకలాపాలతో నిత్యం తలమునకలయ్యే జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. దీనితో ఎన్నో ఏళ్లుగా భారతదేశం చేస్తున్న పోరాటానికి ఫలితం దక్కింది.
 
పుల్వామా దాడి అనంతరం భారతదేశం అంతర్జాతీయ సమాజంపై ఒత్తిడి తెచ్చింది. దాడికి సంబంధించిన పూర్తి ఆధారాలను సమితి ముందు ఉంచడంతో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఐతే అంతకుముందు వరకూ మసూద్ అజర్ విషయంలో మోకాలడ్డిన చైనా కూడా గత్యంతరం లేని పరిస్థితిలో సభ్యదేశాల నిర్ణయానికి మద్దతు తెలిపింది. 
 
మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి సభ్యదేశాలలో మెజారిటీ ఆమోదం తెలిపినప్పటికీ చైనా నాలుగుసార్లు అడ్డుకుంది. కానీ పుల్వామా దాడి తర్వాత ఇక చైనా చేయి దాటిపోయింది. దీనితో మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments