Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు నాలో ఏం తప్పు కనిపించిందో.. తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు : చంద్రబాబు

గత నాలుగేళ్లుగా నాతో కలిసివున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు నాలో ఏం తప్పు కనిపించిందో తెలియదనీ.. అందుకే ప్రతి రోజూ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబా

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (14:40 IST)
గత నాలుగేళ్లుగా నాతో కలిసివున్న జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌కు నాలో ఏం తప్పు కనిపించిందో తెలియదనీ.. అందుకే ప్రతి రోజూ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారంటూ ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సోమవారం విజయనగరం జిల్లా జమ్మాదేవిపేటలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొన్నటిదాకా టీడీపీతో కలసి ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... రాత్రికి రాత్రే ఊహించని విధంగా యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. 
 
అదేసమయంలో పవన్ కల్యాణ్ వాస్తవాలను తెలుసుకొని మాట్లాడటం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ప్రధాని మోడీ నమ్మించి, మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీని ఏపీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీతో కలసి ఏపీకి వైసీపీ ద్రోహం చేస్తోందని విమర్శించారు. 
 
అంతేకాకుండా, 'కేంద్ర ప్రభుత్వ ధీమా ఏంటీ? ఐదుకోట్ల మంది మనోభావాలతో ఆడుకుంటున్నారు' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తమ టీడీపీని చూస్తే భయమని.. వైసీపీ వాళ్లని చూస్తే లోకువ అని అన్నారు. ఎందుకంటే వారిపై 12 చార్జిషీట్లు ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే వైసీపీ నేతలు ఎన్నో డ్రామాలు ఆడుతున్నారని, ఢిల్లీలో మోడీ కాళ్లు పట్టుకుంటున్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments