Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుక కోస్తావా... కోసెయ్.. నీ కత్తి ఎంత పదునుగా ఉందో చూస్తా.. సీఐకు జేసీ ప్రతిసవాల్

పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులకు మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చిన సీఐ గోరంట్ల మాధవ్‌కు అనంతపురం ఎంజీ జేసీ దివాకర్ రెడ్డి ప్రతిసవాల్ విసిరారు. ఈ నెల 25వ తేదీ వరకు అనంతపురం జిల్లాలోనే ఉంటానని, కత్తి పదున

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:20 IST)
పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులకు మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చిన సీఐ గోరంట్ల మాధవ్‌కు అనంతపురం ఎంజీ జేసీ దివాకర్ రెడ్డి ప్రతిసవాల్ విసిరారు. ఈ నెల 25వ తేదీ వరకు అనంతపురం జిల్లాలోనే ఉంటానని, కత్తి పదును పెట్టుకొని నాలుక కోయడానికి సిద్ధంగా ఉండాలని జేసీ సూచించారు.
 
నాలుక కోస్తానంటూ హెచ్చరించిన ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ మాధవ్ వ్యాఖ్యలపై జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం స్పందించారు. ఇదేమైనా సాయికుమార్ సినిమానా? మీసాలు తిప్పడానికి. రియల్ లైఫ్ వేరు, రీల్ లైఫ్ వేరన్నారు. నన్నే హెచ్చరించే అంత మగాడివా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంటికి రావాలా? మీ పోలీస్ స్టేషన్‌కు రావాలా? అనంతపూర్ క్లాక్ టవర్ వద్దకు రావాలా? లేదా మీ ఊరికి రావాలా? చెప్పు? అంటూ సవాల్ విసిరారు. 
 
అంతేకాకుండా, 'నాలుకే కోయాలనుకుంటే వచ్చి కోసేయ్... నీ కత్తి ఎంత పదునుగా ఉందో చూస్తా' అంటూ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ విసిరారు. 'నువ్వు ఖాకీ బట్టలు వదిలేసి రా... నేను కూడా ఈ బట్టలు వదిలేసి మామూలు బట్టలతో వస్తా... నీ సంగతేందో చూస్తా' అంటూ హెచ్చరించారు. నీది నిజమైన మీసమే అయితే ఎప్పుడొస్తావో చెప్పు అంటూ సవాల్ విసిరారు. 25వ తేదీ వరకు తాను ఇక్కడే ఉంటానని... ఏం చేస్తావో చేసుకో అంటూ ఛాలెంజ్ చేశారు. ఈలోగా కత్తికి బాగా పదును పెట్టుకో అన్నారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments