Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారి గెటప్‌లో నిత్యానంద స్వామి.. ఫోటో వైరల్

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (13:25 IST)
Nithyananda
గతంలో రాసలీలల బాగోతంతో బయటపడిన నిత్యానంద స్వామి మళ్లీ వార్తల్లో నిలిచాడు. అత్యాచారం కేసులో నిందితుడైన నిత్యానంద దీవిలో ఏర్పాటు చేసిన కైలాస దేశానికి సందర్శకులకు వీసాల జారీ ప్రారంభించారు. ద్వీపదేశం కైలాస పేరిట ఓ ఈ-మెయిల్ ఐడీ కూడా సృష్టించారు. నిత్యానంద కైలాస దీవి ఆస్ట్రేలియాకు సమీపంలో ఉన్నట్లు భావిస్తున్నారు.
 
ఆస్ట్రేలియా దేశం నుంచి కైలాస దీవికి గరుడ పేరిట ఛార్టర్ విమాన సర్వీసులను నిత్యానంద ప్రారంభించినట్లు వార్తలు వెలువడ్డాయి. కైలాస దీవిలో ఎవరికైనా వసతి కల్పిస్తారని, అయితే కేవలం  మూడు రోజులకు మించి ఉండటానికి అనుమతించరని సమాచారం.
 
దీవిని సందర్శించేవారు పరమశివుని సందర్శించడానికి అనుమతిస్తారు. కైలాస డాట్ ఆర్గ్ పేరిట అధికారిక వెబ్ సైట్ సైతం ప్రారంభించారని సమాచారం. ఆగస్టు నెలలో నిత్యానంద రిజర్వుబ్యాంకు ప్రారంభించిన వీడియోను విడుదల చేశారు. కైలాస దీవిలో ఇంగ్లీషు, సంస్కృతం, తమిళభాషలను అధికారిక భాషలుగా గుర్తించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీవారి గెటప్‌లో నిత్యానంద కనిపించాడు. 
Nithyananda
 
నిత్యానంద అప్పుడప్పుడు తాను కృష్ణ పరమాత్ముని అవతారంగా చెప్పుకుంటాడు. ఇందులో భాగంగా ప్రస్తుతం తిరుమల శ్రీవారి గెటప్‌లో కనిపించి ఆ ఫోటోను నెట్టింట వైరల్ చేశాడు. ఇందుకు నిత్యానంద సమాధి దర్శనం అంటూ ట్యాగ్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments