Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూసూద్ పంజాబ్ సీఎం అవ్వడం ఖాయం, ఎలా? (Video)

Webdunia
సోమవారం, 27 జులై 2020 (20:08 IST)
ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు. సోనూసూద్ ఏ పార్టీలో లేడు. సోనూసూద్ సిఎం అవ్వడమేంటి అనుకుంటున్నారా. సిఎం అవ్వడానికి ఎన్నికలు అవసరం లేదు. పార్టీ అవసరం లేదు. ప్రజల అభిమానం చాలు అని నిరూపించాడు సోనూసూద్. తన గొప్ప వ్యక్తిత్వాన్ని మరోసారి చాటుకున్నాడు.
 
కరోనా సమయంలో స్వస్థలాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతూ తినడానికి తిండిలేని పరిస్థితుల్లో ఉన్న వలసకూలీలను తన సొంత డబ్బులతో గమ్యస్థానాలకు చేర్చారు సోనూసూద్. ప్రాంతం కాదు, కులం కాదు, మతం కాదు మనషులందరూ ఒక్కటేనని నమ్మే వ్యక్తి సోనూసూద్.
 
అందుకే ఎవరికైనా కష్టమంటే అక్కడ వాలిపోతాడు. అదే పనిచేశాడు సోనూసూద్. ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో రైతు ఇబ్బందులు పడుతుంటే వారికి తన వంతుగా సహాయాన్ని అందించాడు. రైతు నాగేశ్వరరావు కూతుర్లు ఇద్దరూ కాడెను రెండు వైపులా పట్టుకుని పొలం దున్నతుంటే వారికి ట్రాక్టర్ తీసిచ్చాడు.
 
అయితే దీనిపై సోనూసూద్‌ను ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశంలోని ప్రతి ఒక్కరు సోనూను అభినందిస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సోనూసూద్ పంజాబ్ వాసి. ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి అన్ని విధాలుగా అర్హుడు. ఇలాంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండాలి. సోనూసూద్ మీరు గ్రేట్. 
 
ఎంతోమంది హీరోలున్నారు. ఎందుకు పనికిరారు. విలన్ వేషాలు వేసే మీలో నిజమైన హీరో ఉన్నాడు అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే సోనూసూద్ సిఎం అవ్వడం ఖాయమంటూ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments