Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబై మేయర్ ఎన్నికలు.. సోనూసూద్ ఏమన్నారంటే..?

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (18:27 IST)
2022లో నిర్వహించనున్న బఅహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బి.ఎం.సి) ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సోనూసూద్‌ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై సోనూసూద్ స్పందించారు. ఈ వార్తల్లో నిజం లేదని, సామన్య వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నానని అన్నారు.
 
కాగా... లాక్‌డౌన్‌ సమయంలో పలువురికి సాయం చేసి రియల్‌ హీరోగా నిలిచారు సోనూసూద్‌. పలు సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు అభిమానులు కోరుతుండగా.. మరికొందరు రాజకీయాల్లోకి రావద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వార్తలు వెలువడుతున్నాయి. బిఎంసి ఎన్నికల్లో ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సెలబ్రిటీలని ఎంపిక చేసుకుందని, ఆ జాబితాలో సోనూతోపాటు మరో నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌, మోడల్‌, ఫిట్‌నెస్‌ పర్సనాలిటీ మిలింద్‌ సోమన్‌లు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది. వీరిలో రితేష్‌ దేశ్‌ముఖ్‌ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ తనయుడు కూడా. కాగా, ఈ వార్తలను సోనుసూద్ కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments