Webdunia - Bharat's app for daily news and videos

Install App

మటన్ దుకాణానికి సోనూసూద్ పేరు : నేనేమైన స‌హాయం చేయ‌గ‌ల‌నా?

Webdunia
ఆదివారం, 30 మే 2021 (18:07 IST)
కరోనా కష్టకాలంలో ప్రతి ఒక్కరికీ ఆపద్బంధవుడుగా కనిపిస్తున్న రియల్ హీరో బాలీవుడ్ విలన్ సోనూ సూద్. కేవలం వ్యక్తులకే కాదు ఏకంగా ప్రభుత్వాలకు కూడా ఆయన సాపడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ‌లోని క‌రీంన‌గ‌ర్‌కు చెందిన వ్యాపారి తన మటన్ దుకాణానికి సోనూసూద్ పేరును పెట్టారు. 
 
ఇది వార్తాంశంగా ప్ర‌చారమై సోనూసూద్ దృష్టికి వ‌చ్చింది. దీనిపై ఆయ‌న స్పందిస్తూ నేను శాఖాహారిని.. అటువంటిది నా పేర మ‌ట‌న్ షాపు? అని చ‌మత్క‌రించాడు. ఆ తర్వాత మీ దుకాణానికి నేనేమైన స‌హాయం చేయ‌గ‌ల‌నా? అని సోనూసూద్‌ ట్వీట్‌లో ప్రశ్నించారు. 
 
కొవిడ్ -19 మహమ్మారి సెకండ్ వేవ్‌లో సైతం సోనూసూద్ కొవిడ్ రోగులకు ఆక్సిజన్ కాన్సంట్రేట‌ర్లు అంద‌జేయ‌డం, ఇత‌ర అవ‌స‌ర‌మైన మందులు, ప‌రిక‌రాల‌ను అంద‌జేస్తుండ‌టం మ‌నమంతా చూస్తున్న‌దే. జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌లు ఆక్సిజ‌న్ ప్లాంట్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ఇటీవ‌లే తెలిపాడు.
 
క‌ర్నూలు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మొద‌టి ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా జూన్ నెలాఖ‌రులో ఏపీలోని ఆత్మ‌కూరు, నెల్లూరులో ఆక్సిజ‌న్ ప్లాంట్లు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు చెప్పారు. గ్రామీణ భార‌త‌దేశానికి మ‌ద్ద‌తునిచ్చే స‌మ‌య‌మిదని సోనూసూద్ అన్నారు.
 
కరోనా సీజన్ మొదలైనప్పటి నుంచి తన సేవలు కొనసాగిస్తున్నాడు. మొదటి విడత కరోనా వచ్చినప్పుడు వలస కూలీలను వారి స్వస్థలాలకు చేరవేశాడు. ఇప్పుడు కొనసాగుతున్న రెండవ సీజన్‌లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మిస్తూ, అవసరమైన వారికి కాన్సన్ ట్రేటర్లను పంపిస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments