Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనూ సూద్ ఫోటో స్టోరీ.. స్పందించిన షావోమి ఇండియా ఎండీ

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (20:53 IST)
Sold Cow
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో వలస కార్మికుల కోసం బస్సులు నడిపారు. ఆపై పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టారు. తాజాగా సోషల్ మీడియాలో సోనూ సూద్ పిల్లల ఆన్‌లైన్‌ చదువుల కోసం కుటుంబ పోషణకు ఆధారణమైన ఆవును అమ్ముకున్న వైనంపై ఓ ఫోటో స్టోరీని షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. 
 
దీనిపై ప్రముఖ మొబైల్‌ తయారీదారు షావోమి ఇండియా ఎండీ మను కుమార్‌ జైన్‌ స్పందించారు. హృదయాన్ని కదిలించే అంశమంటూ ఆ కుటుంబానికి సాయం అందించేందుకు జైన్‌ ముందుకొచ్చారు. వారి పిల్లల విద్యాభ్యాసానికి సాయం చేస్తామని కూడా ప్రకటించారు. 
 
ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌ నిత్యావసరమైన వస్తువుగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. ఆన్‌లైన్‌ చదువులు, వర్క్‌ ఫ్రం హోం లాంటి వాటికి స్మార్ట్‌ఫోన్‌ చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. 
 
ఈ ట్వీట్‌కు నెటిజన్లు స్పందించడంతో షావోమి టీం బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించిందని జైన్‌ తెలిపారు. అలాగే బిడ్డల చదువుకు ఎలా సాయం చేయాలనేదానిపై చర్చిస్తున్నట్టు తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments