Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైరల్ అయినా రాహుల్ కౌగిలింత.. సోనమ్ ఫన్నీ కామెంట్..!!

పార్లమెంట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని హాగ్ చేసుకోవడం.. తర్వాత కన్నుగీటడం వంటి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది రాహ

Webdunia
శనివారం, 21 జులై 2018 (10:03 IST)
పార్లమెంట్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని మోడీని హాగ్ చేసుకోవడం.. తర్వాత కన్నుగీటడం వంటి విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  దీనిపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది రాహుల్ చేసిన పని లోక్‌సభ చరిత్రలో నిలిచిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ హాగ్‌పై బాలీవుడ్ సెలబ్రిటీలు ట్విట్టర్ ద్వారా స్పందించారు.
 
దేశవ్యాప్తంగా కౌగిలింతల దినోత్సవం జరుపుకోవాలంటూ రాజ్‌కుమార్ రావు ట్వీట్ చేశారు. రాజ్ కుమార్ చేసిన ట్వీట్‌కు హీరోయిన్ సోనమ్ కపూర్ "హగ్ ఎమోషన్స్" అని రీ ట్వీట్ చేసింది. "హ్యాంగ్ చేసుకోవడం మంచిదే అని.. అందులో తప్పేమి లేదని.. రాహుల్‌ను బీజేపీ నేతలు కూడా హగ్ చేసుకోవాలని.. రాహుల్ హగ్ చేసుకోవడాన్ని నెగెటివ్‌గా చూడటం సరికాదని" బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దడ్లాని ట్వీట్ చేశాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు చేస్తున్న ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 
 
మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. "నేను ఆ మేజర్ డ్రామాను లైవ్‌గా చూడడం మిస్ అయ్యా... కౌగిలింతలు, కన్నుగొట్టడం, వాక్చాతుర్యం మొదలైనవి" అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. మొత్తంమీద దీనికి సంబంధించిన సందేశాలు, వీడియోలతో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సప్‌ హోరెత్తిపోయాయి. కొందరు హాస్యాన్ని సృష్టింస్తే... మరికొందరు మోడీ ఫ్యాన్స్‌ ట్రోలింగ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments