మా మంచి మాస్టారూ! స్కూలును వీడి పోవ‌ద్దు!!

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (10:23 IST)
అది... చెన్నైలోని తిరువళ్ళూరు ప్రభుత్వ ఉన్నతపాఠశాల
స‌మ‌యం... ఉదయం 11 గంటలు.
ఉన్నట్లుండి విద్యార్ధుల ఏడుపులతో స్కూలు దద్దరిల్లిపోయింది...
ఏమి జరుగుతుందో తెలియక బయట వున్నవారు పరుగున పాఠశాలలోనికి వ‌చ్చేశారు. 
అక్కడ జరుగుతున్నది చూసి నిర్ఘాంతపోయారు.
విద్యార్ధులంతా ఒక 30 ఏళ్ళ యువకుని చుట్టిముట్టి ఏదో ప్రాదేయపడుతూ, వేడుకుంటున్నారు..
కొందరు ఆయ‌న కాళ్ళు పట్టుకొని కదలనీయడంలేదు...
ఆశ్చర్యమేమిటంటే, ఆ యువకుడూ వారితో పాటు ఏడుస్తూ ఉన్నాడు...
ఇంతకీ అక్కడ ఏమి జరుగుతోంది?
పిల్లంతా ఎందుకు ఏడుస్తున్నారు?
 
ఆ యువ‌కుడి పేరు జె.భగవాన్. ఆ పాఠశాలలో 2014లో ఇంగ్లీషు టీచర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడ చదివే పిల్లలంతా చాలా వరకు పేద కుటుంబాల నుండి వచ్చినవారే. భగవాన్ సర్వీస్ లో జాయిన్ అయినప్పటి నుండీ పిల్లలతో స్నేహితుడిగా కలిసిపోయాడు. ఆప్యాయంగా మాట్లాడటం...ఎంతో నేర్పుగా వారికి బోధన చేయడం భ‌గ‌వాన్ స్పెషాలిటీ. కొందరికి భవిష్యత్ చదువుల గురించి వివరించేవాడు, అందుకే పిల్లలకు ఎంతో ఇష్టుడైయ్యాడు. 
 
అలాంటి భగవాన్ కి స‌డ‌న్ గా ట్రాన్స్ ఫర్ ఆర్డర్ వచ్చింది. అది తెలిసిన పిల్లలు అతనిని వెళ్ళనివ్వకుండా అడ్డుపడ్డారు.  ఇది వైరల్ అయి రాష్ట్రమంతా సంచలనంగా మారి రాష్ట్ర విద్యాశాధికారుల వ‌ర‌కు చేరింది. ప్రస్తుతానికి 10 రోజులు అత‌ని బదిలీని ఆపుతూ ఉత్తర్యులు ఇచ్చారు. ద‌టీజ్ ద రియ‌ల్  టీచ‌ర్ ప‌వ‌ర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రీసెంట్‌గా వచ్చిన చిత్రంలోలాగా మా చిత్రంలో ఏఐ ఉపయోగించలేదు : నిఖిల్

విజయ్ చిత్రం జన నాయగన్ విడుదల ఇప్పట్లో లేనట్టేనా?

హిమాన్షీ ఖురానాకు బెదిరింపులు - రూ.10 కోట్లు డిమాండ్

​అతి ప్రేమ భయానకం అంటూ వస్తోన్న 100 డేస్ లవ్ స్టోరీ

Garuda Ram: నాగబంధం నుంచి బైరాగి గా గరుడ రామ్‌ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

మొలలు లేదా పైల్స్ వున్నవారు తినకూడని పదార్థాలు ఏంటి?

Pink salt : పింక్ సాల్ట్ ఆరోగ్య ప్రయోజనాలు.. ఇందులో అయోడిన్ ఉండదు

Valentines Day: వాలెంటైన్స్ డే.. ఎర్ర గులాబీల ఔచిత్యం.. సెయింట్ వాలెంటైన్ గౌరవార్థం..

అల్లంతో కండరాల నొప్పి, బహిష్టు నొప్పి తగ్గుతుంది

తర్వాతి కథనం
Show comments