Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతబడులకు ఉపయోగించే పాము అక్కడ దొరికింది.. ధర రూ.1.25 కోట్లు

Webdunia
సోమవారం, 30 డిశెంబరు 2019 (14:12 IST)
ఆ పాముకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ వుంది. ఆ అరుదైన పాము ఐదుగురి చేతికి చిక్కింది. దాని విలువ తెలుసుకుని అమ్మాలనుకున్నారు. కానీ పోలీసులకు చిక్కారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఈ పాము పేరు రెడ్ శాండ్ బోవ స్నేక్. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పాము  ధర 1.25 కోట్లు. అయితే ఈ అరుదైన పామును పట్టుకున్న ఐదుగురు వ్యక్తులు నర్సింఘర్ ప్రాంతంలో అరుదైన ప్రాణమును విక్రయించేందుకు ప్రయత్నించారు.
 
కానీ పక్కా సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ పామును  పట్టుకుని విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తుల్లో  ఇద్దరు మైనర్లు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. అత్యంత విలువైన అరుదైన జాతికి చెందిన రెడ్ సాండ్ బోవా స్నేక్ విషపూరితమైన పాము కాదని పోలీసులు తెలిపారు. 
 
ఈ పామును మందులు కాస్మెటిక్స్ తయారీలో వాడుతూ ఉంటారని చెప్తున్నారు. ఇంకా చేతబడులు చేసేందుకు కూడా ఈ పామును ఉపయోగిస్తారని పోలీసులు చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పామును కలిగివున్న వారికి అదృష్టం ఖాయమని విశ్వాసం. 
 
అయితే స్థానిక బస్టాండ్ ప్రాంతంలో పాము విక్రయంపై ఫోన్ మాట్లాడుతుండగా.. అక్కడే ఉన్న పోలీస్ ఇన్ ఫార్మర్ విని సమాచారం ఇచ్చారని.. దీంతో వెంటనే అలర్ట్ అయ్యి  దాడి జరిపి నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments