శ్రీదేవికి దివ్యభారతి దెయ్యం పట్టింది... రవీనా టాండన్ షాకింగ్ కామెంట్స్

శ్రీదేవి చనిపోయిన దగ్గర్నుంచి సెలబ్రిటీలు ఎవరికి తోచిన విషయాలను వారు చెపుతూనే వున్నారు. శ్రీదేవితో కలిసి ఓ చిత్రంలో నటించిన రవీనా టాండన్ తాజాగా చెప్పిన ఓ విషయం షాకింగ్‌గా మారింది. శ్రీదేవికి దివ్యభారత

Webdunia
సోమవారం, 12 మార్చి 2018 (20:00 IST)
శ్రీదేవి చనిపోయిన దగ్గర్నుంచి సెలబ్రిటీలు ఎవరికి తోచిన విషయాలను వారు చెపుతూనే వున్నారు. శ్రీదేవితో కలిసి ఓ చిత్రంలో నటించిన రవీనా టాండన్ తాజాగా చెప్పిన ఓ విషయం షాకింగ్‌గా మారింది. శ్రీదేవికి దివ్యభారతి దెయ్యం పట్టిందంటూ ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. దివ్యభారతి ముంబైలోని తులసి అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. 
 
ఆమె చనిపోయే ముందు నటించిన ఆఖరి చిత్రం లాడ్లా. ఈ చిత్రానికి రాజ్ కన్వర్ దర్శకత్వం వహించారు. ఐతే చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆమె చనిపోవడంతో ఆమెకు దగ్గరి పోలికలున్న శ్రీదేవిని దర్శకనిర్మాతలు సంప్రదించారు. తొలుత శ్రీదేవి నటించేందుకు నో చెప్పినప్పటికీ ఆ తర్వాత అంగీకరించిందట. షూటింగ్ చేసేందుకు స్పాట్‌కు వెళ్లగానే శ్రీదేవి ఏదో పూనకం వచ్చినట్లు డైలాగులు చెప్పకుండా బిగుసుకుపోయిందట. 
 
దీనితో రవీనా టాండన్ తోపాటు మిగిలిన నటులంతా గాయత్రీ మంత్రం జపించగానే పరిస్థితి కుదుటున పడిందట. దాన్నిబట్టి అప్పట్లో దివ్యభారతి పట్టుకున్నదని తామంతా భయపడ్డామని చెప్పుకొచ్చింది. అంతేకాదు... శ్రీదేవి చనిపోయిన రోజు కూడా దివ్యభారతి చనిపోయిన రోజు మరుసటి రోజు అనీ, ఇది చూస్తుంటే ఏదో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుందని రవీనా టాండన్ వ్యాఖ్యానిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments