Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేస్తున్నా.. కాస్కోండి.. జనవరిలో రజినీకాంత్ కొత్త పార్టీ!

Webdunia
గురువారం, 3 డిశెంబరు 2020 (13:13 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులకు శుభవార్త చెప్పారు. తన రాజకీయ అరంగేంట్రంపై ఆయన ఓక్లారిటీ ఇచ్చారు. రాజకీయాల్లోకి వచ్చేది కాస్త ఆలస్యమైనప్పటికీ.. వచ్చేది మాత్రం పక్కా అంటూ తేల్చి చెప్పారు. జనవరిలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఇదే అంశంపై డిసెంబరు 31వ తేదీన ఓ ప్రకటన చేస్తానని ఆయన గురువారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
దీంతో ఎన్నో యేళ్లుగా ఊరిస్తూ వచ్చిన ఆయన రాజకీయ ప్రవేశంపై ఉన్న సందేహాలు పటాపంచలైపోయాయి. కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. జనవరిలో పార్టీ ప్రారంభించనున్నట్లు ట్వీట్ చేశారు. డిసెంబర్ 31న పార్టీ ప్రకటన ఉంటుందన్నారు. పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. రజనీ ట్వీట్‌తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. 
 
కాగా, తన రాజకీయ ప్రవేశం, కొత్త పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ ఇటీవలే తన అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులతో సుధీర్ఘంగా మంతనాలు జరిపారు. చెన్నై కోడంబాక్కంలోని తన సొంత కళ్యాణ మండపంలో ఈ చర్చలు జరిపారు. ఈ చర్చల తర్వాత ఓ నిర్ణయానికి వచ్చి.. ఇపుడు తన కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments