ఆ నైట్ క్లబ్‌లో మహిళతో ఉన్నది రాహుల్ గాంధీయేనా?

Webdunia
మంగళవారం, 3 మే 2022 (13:16 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు, ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ చిక్కుల్లో పడ్డారు. ఓ నైట్ క్లబ్‌లో ఓ మహిళ పక్కన రాహుల్ ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీన్ని బీజేపీ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. ఈ నైట్ క్లబ్ నేపాల్‌లోని ఖాట్మండులో రాహుల్ ఉన్నట్టుగా తెలుస్తోది. అయితే, రాహుల్ పక్కనున్న మహిళ ఎవరన్న విషయంపై ఇపుడు పెద్ద చర్చే సాగుతోంది. 
 
అయితే, ఆమె నేపాల్‌లోని చైనా అంబాసిడర్ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. చైనా రాయబారితో కలిసి రాహుల్ పార్టీ చేసుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది రాహుల్ నేపాల్‌లో ఉన్నట్టుగా ఖాట్మండ్ పోస్ట్ ఓ కథనాన్ని కూడా ప్రచురించింది. 
 
మరోవైపు, మయన్మార్‌లో నేపాల్ రాయబారిగా పని చేసిన భీమ్ ఉదాస్ తన కుమార్తె వివాహానికి రాహుల్‌ను ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ వివాహానికి హాజరయ్యేందుకు ఆయన నేపాల్ వెళ్లినట్టు కొందరు ప్రచారం చేస్తున్నారు. 
 
మరోవైపు, ఈ వీడియోను భారతీయ జనతా పార్టీ ఐటీ వింగ్ చీఫ్ అమిత్ మాళవీయ సోషల్ మీడియాలో షేర్ చేసి రాహుల్‌పై విమర్శలు గుప్పించారు. సొంత పార్టీలో రచ్చ జరుగుతుంటే రాహుల్ గాంధీ నేపాల్ క్లబ్‌లో ఎంజాయ్ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ ఐ బొమ్మ కుర్రోడి టాలెంట్‌ను టెర్రరిస్టులపై ప్రయోగిస్తే బాగుంటుంది: నటుడు శివాజీ

ఇంకా ఎంతమందితో పెళ్లి చేస్తారు.. వివాహం చేసుకునే ఆలోచన లేదు.. త్రిష

Sai Durgatej: వచ్చే ఏడాదిలో వివాహం ఉంటుందన్న సాయి దుర్గతేజ్

Varanasi: వారణాసి... ఐదు నిమిషాలు నెరేట్ చేశాక నా మైండ్ బ్లాక్ అయింది

Ram : ఆంధ్ర కింగ్ తాలూకా... ఒక రోజు ముందుగానే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments