Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాఫెల్ డీల్ కీలక పత్రాలు చోరీ అయ్యాయి : సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

Webdunia
బుధవారం, 6 మార్చి 2019 (16:08 IST)
రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందానికి సంబంధించి అత్యంత కీలకమైన పత్రాలు చోరీకి గురయ్యాయి. ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్ర అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వెల్లడించారు. ఈ డీల్‌ కీలక పత్రాలు రక్షణ శాఖ కార్యాలయంలోనే చోరీకి గురైనట్టు ఆయన న్యాయస్థానానికి విన్నవించారు.
 
రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంలో భారీస్థాయిలో అవినీతి చోటుచేసుకుందనీ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు అనేక మంది రక్షణ రంగ నిపుణులు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, రాఫెల్ యుద్ధ విమానాల తయారీని ఎంతో అనుభవం ఉన్న హాల్ (హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్)కు అప్పగించకుండా, గత యేడాది పురుడు పోసుకున్న అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌కు అప్పగించారు. దీంతో భారీ మొత్తంలో అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో ఈ డీల్‌పై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. ఇరు వర్గాల వాదనల్లో భాగంగా, ఓ నోట్‌లో ఉన్న వివరాలను న్యాయవాది ప్రశాంత్ భూషన్ చదువుతుండగా వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించిన అంశాలు రక్షణ శాఖ కార్యాలయం నుంచి చోరీకి గురయ్యాయని... దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్టు వెల్లడించారు. 
 
ప్రస్తుత లేదా మాజీ ఉద్యోగులు వీటిని చోరీ చేసి ఉంటారని చెప్పారు. వార్తాపత్రికల్లో ప్రచురితమైన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. రక్షణ కొనుగోళ్ల వ్యవహారం ఎంత కీలకమైనదో ఇటీవల జరిగిన పరిణామాలు చెబుతున్నాయని... వీటిని శల్యపరీక్ష చేయడం వల్ల భవిష్యత్తు కొనుగోళ్లపై ప్రభావం పడుతుందని అటార్నీ జనరల్ కోర్టుకు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నెగటివ్ టాక్, అల్లు అర్జున్ 'పుష్ప కా బాప్' కేక్ కట్

Game Changer: తొలి రోజున ప్రపంచ వ్యాప్తంగా రూ.186 కోట్ల కలెక్షన్స్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments