ముంబై హైవేపై పది అడుగుల కొండ చిలువ.. వీడియో వైరల్ (video)

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (19:30 IST)
దేశ వాణిజ్య నగరమైన ముంబై హైవేపై భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. హైవేపై కొండచిలువను చూసిన వాహనదారులు షాక్ తిన్నారు. దీంతో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. ముంబై చునాబట్టి సమీపంలోని తూర్పు ఎక్స్‌ప్రెస్ హైవేపై 10 అడుగుల కొండచిలువ వెళ్లడాన్ని వాహనదారులు గమనించారు. భారీ కొండచిలువ రోడ్డు దాటడాన్ని చూసేందుకు వాహనదారులు తమ వాహనాలను ఆపడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. 
 
ఇక రోడ్డు దాటిన కొండచిలువ ఓ కారు టైర్‌కు చుట్టుకుంది. దీంతో ఆ కారును రోడ్డు పక్కకు పెట్టించి పోలీసు అధికారులు రెస్క్యూ సిబ్బందికి సమాచారమిచ్చారు. గంట తర్వాత రెస్క్యూ సిబ్బంది అక్కడకు వచ్చి కొండచిలువను రక్షించారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. లైకులు, షేర్లు పెరిగిపోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suhas: సుహాస్ చిత్రం హే బ‌ల్వంత్‌ జీ5లో రాబోతోంది

Deepak Saroj: శ్రీమహా విష్ణు పేరేంటి? రొమాంటిక్ ఫస్ట్ లుక్ ఏమిటి?

Ravipudi: వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి చిత్రం రాబోయే సంక్రాంతికి ఫిక్స్

Ram Charan Cake cutting : పెద్ది షూటింగ్ సెట్లో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుక

Naga Shaurya: అమ్మవారి ముందు పిడికిలి బిగించి గన్ పట్టిన బ్యాడ్ బాయ్ కార్తిక్ ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి కూరగాయల్లో తినకూడనివి ఏవి?

మోతాదుకి మించి గ్రీన్ టీ తాగితే...

సిప్లా నుంచి మసాలా జామ రుచితో ప్రోలైట్‌ ఓఆర్ఎస్‌ పోర్ట్‌ఫోలియో

వెన్ను నొప్పి పారదోలే చిట్కాలు

వన్‌చెఫ్‌ను విడుదల చేసిన ఫిలిప్స్

తర్వాతి కథనం
Show comments