Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియాంక, నిక్‌లపై నెటిజన్ల ఫైర్.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 3 డిశెంబరు 2018 (10:51 IST)
సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. ప్రస్తుతం అన్నీ విషయాలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దీపావళి రోజున బాణాసంచా కాల్చడంపై సుప్రీం కోర్టు షరతులు విధించిన సంగతి తెలిసిందే. కానీ గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా, అమెరికన్ సింగర్ నిక్ జోనస్ వివాహ వేడుకలో భాగంగా... రాజస్థాన్‌లోని జోధ్‌పూర్, ఉమైద్ భవన్ ప్యాలెస్‌పై బాణసంచా కాల్చడం వివాదాస్పదమైంది. 
 
సుప్రీం కోర్టు షరతులు విధిస్తుంటే.. ప్రియాంక, నిక్‌లు మాత్రం తమకు నచ్చినట్లు బాణాసంచా కాలుస్తారా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రియాంక ఆస్తమా వ్యాధిపై అవగాహన కలిగించే కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ ఇలాంటి పనికి ప్రోత్సహించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. 
 
కాగా, ఉమైద్ ఖాన్ ప్యాలెస్‌లో నిక్, ప్రియాంకల వివాహం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి వేడుకకు కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు రిలయన్స్ దిగ్గజం అంబానీ కుటుంబం కూడా హాజరైంది. కానీ ప్యాలెస్‌పై వీరి వివాహం సందర్భంగా బాణాసంచా కాల్చడం ప్రస్తుతం వివాదానికి దారితీసింది. మరి ఈ వివాదంపై ప్రియాంక చోప్రా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments