Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాస్క్ ధరించలేదని మహిళ జుట్టు పట్టుకున్న పోలీసులు (వీడియో)

Webdunia
బుధవారం, 19 మే 2021 (21:29 IST)
madhya pradesh
మాస్క్ ధరించలేదని ఓ మహిళ పట్ల పోలీసులు చాలా కఠినంగా వ్యవహరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది. కూరగాయాలు కొనేందుకు తన కూతురితో కలిసి మార్కెట్‌కు వచ్చిన ఓ మహిళ మాస్క్ పెట్టుకోలేదు. దీనిపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఆమెను అదుపులోకి తీసుకునేందుకు ఎంతగానో ప్రయత్నించారు. ఇందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో సంయమనం కోల్పోయి ఆమెను ఇష్టానుసారంగా కొట్టారు. జుట్టుపట్టుకుని మరీ ఆమెను పోలీసులు కొట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
 
ఈ వీడియోలో ఆమెను ఇద్దరు పోలీసులు లాక్కెళ్లడం కనిపించింది. పలుసార్లు ఆమెను కిందపడేశారు. ఆమెను బలవంతంగా పోలీసు జీపు ఎక్కించేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె అందుకు ఒప్పుకోలేదు. తన తల్లితో పోలీసులు ఇలా వ్యవహరించడాన్ని ఆమె కూతురు కూడా ప్రతిఘటించింది. దీంతో పోలీసులు ఆమెను పక్కకు తోసేశారు.
 
అయితే అసలు ఆమెపై పోలీసులు అంత కఠినంగా వ్యవహరించడానికి అసలు కారణం ఆమె మాస్క్ ధరించకపోవడమే అని తెలిసింది. మాస్క్ పెట్టుకోకపోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద తప్పే. కానీ అలా చేయనుందుకు ఓ మహిళ పట్ల పోలీసులు మరీ ఇంత దారుణంగా వ్యవహరించడం ఏంటనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments