Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముస్లిం యువకుడిని హత్తుకుని కాపాడిన సిక్కు పోలీస్.. శభాష్ అంటోన్న నెటిజన్స్ (వీడియో)

దేశంలో సోషల్ మీడియా ప్రభావంతో అనుమానం వస్తే చాలు.. ముందు వెనకా ఆలోచించకుండా వ్యక్తులను కొట్టి చంపేసే సంఘటనలు రోజు రోజుకీ అధికమవుతున్నాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నా

Webdunia
శుక్రవారం, 25 మే 2018 (18:41 IST)
దేశంలో సోషల్ మీడియా ప్రభావంతో అనుమానం వస్తే చాలు.. ముందు వెనకా ఆలోచించకుండా వ్యక్తులను కొట్టి చంపేసే సంఘటనలు రోజు రోజుకీ అధికమవుతున్నాయి. దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతూనే వున్నాయి. అయితే ఉత్తరాఖండ్‌లో ఓ పోలీస్ వీహెచ్‌పీ కార్యకర్తల నుంచి ఓ యువకుడి కాపాడాడు. తద్వారా నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు.
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్‌లో ప్రాంతంలో ఓ ముస్లిం యువకుడిని కొందరు హిందూ యువకులు, వీహెచ్‌పీ కార్యకర్తలు చితక్కొట్టడానికి ఏకమయ్యారు. కానీ ఆ ముస్లిం యువకుడిని పోలీసులు హత్తుకుని.. ఆ యువకుడి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన వారంతా.. రియల్ హీరో ఈ పోలీస్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
ముస్లిం యువకుడిపై దాడికి కారణం ఏంటంటే..? హిందూ యువతిని ప్రేమించడమే. అంతే రామ్‌పూర్‌ గ్రామంలోని ఓ దేవాలయం సమీపంలో అతడిని అడ్డుకుని దాడి చేయడానికి కొందరు హిందూ యువకులు ప్రయత్నించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీస్‌ ఆఫీసర్‌ గంగాదీప్‌ సింగ్‌ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని దాడి నుంచి ఆ ముస్లిం యువకుడి కాపాడాడు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments