సర్పంచ్‌గా కూడా గెలవలేని వ్యక్తి రాష్ట్ర మంత్రి : పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 9 అక్టోబరు 2018 (10:29 IST)
ఏపీ ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. గ్రామ సర్పంచ్‌గా కూడా గెలవలేని నారా లోకేశ్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారని, ఇది మన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు.
 
ఈస్ట్ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ, లోకేష్ కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేడని ఎద్దేవా చేశారు. 'విప్ పదవి నుంచి చింతమనేనిని తొలగిస్తారా.. లేదా?.. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు లేఖ రాయమంటారా?' అంటూ ఆయన నిలదీశారు. 
 
స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే జనసేన బలపడుతుందనే భయం ప్రభుత్వానికి ఉందన్నారు. కౌలురైతులకు అండగా ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రతి గ్రామంలో జనసేన జెండా ఉందని ఆయన చెప్పారు. గ్రామాలకు నిస్వార్థంగా పనిచేసే సర్పంచ్‌లు కావాలని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

ప్రధాని మోడీ వల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు : రేణు దేశాయ్

Prabhas: శర్వా.. బైకర్ ట్రైలర్‌ పై ప్రశంసలు కురిపించిన ప్రభాస్

Dil Raju: గాయపడ్డ సింహం విడుదల చేస్తాం, కానీ కండిషన్స్ అప్లై : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆనందం, ఆదరణ, నివారణ సంరక్షణతో వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించాలని జాతీయ పిలుపు

మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు, గుర్తించడం ఎలా?

డానోన్ ఇండియా రక్తహీనతపై పోరాటానికి సహాయం చేస్తామని ప్రతిజ్ఞ

టైప్ 2 మధుమేహుల కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ ఒబెడా విడుదల

తర్వాతి కథనం
Show comments