వయసు పెరుగుతున్నా డబ్బుపై వ్యామోహం చావడం లేదు...

ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు గుప్పించారు. తన పోరాట యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, 65 ఏళ్ల వయసు వచ్చినా

Webdunia
సోమవారం, 9 జులై 2018 (16:20 IST)
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు విమర్శలు గుప్పించారు. తన పోరాట యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, 65 ఏళ్ల వయసు వచ్చినా డబ్బు, పదవిపై చంద్రబాబుకు వ్యామోహం తగ్గలేదని విమర్శించారు. 2019 ఎన్నికలు ఏపీకి చాలా కీలకమని... రాజకీయరంగంలో ఆర్థిక, సామాజిక విప్లవాన్ని జనసేన తీసుకురాబోతోందని చెప్పారు. 
 
రాష్ట్రాభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు, లోకేష్, జగన్‌లు తమ అనుచరులతో కలిసి రావాలని, తాను ఒక్కడినే వస్తానని... ఏ పాలసీపైనైనా చర్చలో కూర్చుందామని... అప్పుడు ఎవరికి ఎంత పరిజ్ఞానం ఉందో తెలుస్తుందని సవాల్ విసిరారు. జనసేనకు భావజాలం పుష్కలంగా ఉందని... వైసీపీకి అది లేదని విమర్శించారు. 2019 ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. 
 
పనిలోపనిగా చంద్రబాబు తనయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌కు కూడా ఆయన ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే లోకేశ్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. లోకేశ్‌ మీద జనసేన తరపున ఒక కార్యకర్తను నిలబెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామన్నారు. దొడ్డిదారిన లోకేశ్‌ను మంత్రిని చేశారని, ఆయనను సీఎం చేయాలని చూస్తే ఊరుకోబోమని పవన్‌ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా పూర్వీకులు భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారు: విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు

'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్ (వీడియో)

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments