Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిపై జనసేన కార్యకర్తలు ఫైర్.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. ఆ సింగర్లు ఏమన్నారంటే?

జనసేన పార్టీ అధినేత, అగ్రహీరో పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. శ్రీశక్తిపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (16:27 IST)
జనసేన పార్టీ అధినేత, అగ్రహీరో పవన్ కల్యాణ్‌పై శ్రీరెడ్డి అలియాస్ శ్రీశక్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపాయి. శ్రీశక్తిపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. శ్రీరెడ్డిపై ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్‌పై, ఆయన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు శ్రీశక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ ఫిర్యాదులో జనసేన కార్యకర్తలు కోరారు. 
 
మరోవైపు శ్రీశక్తి కాస్టింగ్ కౌచ్‌పై చేస్తున్న పోరాటానికి మద్దతు లభిస్తోంది. కొందరు తారలు సినీ ఇండస్ట్రీలో తమకు ఏర్పడిన చేదు అనుభవాలను వెల్లగక్కుతున్నారు. ఈ క్రమంలో ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింగర్ కౌసల్య తన కెరీర్ గురించి అనే విషయాలను తెలియజేశారు. ఆర్పీ పట్నాయక్‌గారు వరుసగా మూడు సినిమాలకు తనతో పాడించారు. 
 
ఆ సమయంలో చక్రిగారు బాచీ సినిమా కోసం పిలిపించి, ''చిత్రం'' సినిమాలో ''ఏకాంతవేళ..'' పాడిన అమ్మాయినని దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు పరిచయం చేశారు. ఇక టెస్టులెందుకని.. పాడించేయ్ అంటూ పూరీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ చిత్రంలో రెండు పాటలు పాడానని చెప్పుకొచ్చింది. తర్వాత చక్రి సినిమాల్లోనే పాడుతూ వచ్చాను. కానీ చనిపోయేందుకు నాలుగైదు సంవత్సరాల ముందు ఆయన కూడా తనకు ఛాన్సులు ఇవ్వలేదని.. కారణం ఏమిటంటే.. వరుసగా చక్రి సినిమాలకు పాడటం ప్లస్ కాదు మైనస్ కూడా అవుతుందన్నారు. తనతో టర్మ్స్ బాగాలోని వాళ్లు నిన్ను పిలవరని చక్రి చెప్పేవారని కౌసల్య తెలిపింది. 
 
అలాగే ఆలీతో సరదాగాలో సింగర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మొహమాటం ఎక్కువ కావడంతో అవకాశాలను ఎవరి వద్ద అడగలేదని చెప్పింది. అవకాశాల కోసం అడగలేదని.. అహంభావం అనుకుంటారని.. నిజానికి కారణం అది కాదని చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments