Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన క్యాలెండర్‌ను చేతిలో పెట్టి చిరు నుంచి ఒట్టు వేయించుకున్న పవన్.. ఎందుకు?

Webdunia
గురువారం, 25 జులై 2019 (15:14 IST)
చాలా గ్యాప్ తరువాత మెగా కుటుంబ సభ్యులు ఒకచోట చేరారు. అది కూడా మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్‌లు ఒకేచోట కలిశారు. జనసేన పార్టీకి చెందిన నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్ళారు పవన్. వీరి మధ్య ఏకంగా రెండుగంటల పాటు చర్చ జరిగింది.
 
ఫ్యామిలీ గురించి అయితే మనోహర్ లేకుండా కేవలం పవన్ మాత్రమే వెళ్ళుండాలి. కానీ నాదెండ్ల మనోహర్‌ను వెంట పెట్టుకుని మరీ పవన్ కళ్యాణ్ చిరంజీవి ఇంటికి వెళ్లడం.. చాలాసేపు ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం చర్చకు దారితీస్తోంది.
 
ఇంకా ఎన్నికలకు నాలుగు సంవత్సరాల పది నెలల కాలం ఉంది. ఇప్పటి నుంచే రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తే చాలా మంచిది. నేను అదే చెబుతున్నా. ఈసారికి నా మాట వినండి.. జనసేన జెండాను చేతిలో పట్టుకుందాం. జనం సమస్యలపై పోరాడుదాం. ఇదే సరైన సమయం. రెండు ప్రధాన పార్టీలపై జనం పూర్తిగా విసిగిపోయారు. ఆలోచించు అన్నా. ఇదిగో జనసేన క్యాలెండర్.. దీన్ని చేతిలో పెట్టుకో. మనం ముందుకు సాగుదాం అంటూ పవన్ కళ్యాణ్ ఆవేశంగా చిరంజీవితో మాట్లాడినట్లు తెలుస్తోంది.
 
అయితే చిరంజీవి మాత్రం ఆవేశానికి లోనవ్వకుండా తమ్ముడిని సముదాయించే ప్రయత్నం చేశారట. దేనికైనా ఓపిక కావాలి. నేను సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాను. మిగిలిన విషయాలను పట్టించుకోవడం లేదు. కాస్త ఆలోచించుకునే సమయం ఇవ్వు. మొదట్లో నేను రాజకీయాల్లో ఇబ్బందిపడ్డ విషయం నీకు తెలుసు కదా. వెయిట్ చెయ్. చూద్దామంటూ పవన్ కళ్యాణ్‌కు నచ్చజెప్పారట చిరంజీవి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments