Webdunia - Bharat's app for daily news and videos

Install App

సానియా మీర్జాతో విడాకులు.. నటి అయేషా-మాలిక్ ఫోటోలు వైరల్

Webdunia
శనివారం, 12 నవంబరు 2022 (11:27 IST)
Ayesha Omar-Shoaib Malik
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకుల పుకార్ల మధ్య పాకిస్థానీ నటి అయేషా ఒమర్‌తో షోయబ్ మాలిక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. గత కొద్ది కాలంగా సానియా- షోయబ్‌ల మధ్య వివాహ బంధం అంతగా సరిగ్గా లేదని వారు విడిపోవాలని అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. సానియా- షోయబ్ విడాకులకు ఆయేషా ఒమన్ కారణమని వార్తలు వచ్చాయి.  
 
12 సంవత్సరాల వివాహ బంధం అయేషా కారణంగా తెగతెంపులు కానుంది. సానియా- షోయబ్ దంపతులకు ఓ కుమారుడు వున్నారు. అయితే విడాకులపై సానియా దంపతులు నోరెత్త లేదు. 35 ఏళ్ల సానియా, ఆరు గ్రాండ్ స్లామ్ డబుల్స్ టైటిల్స్ విజేతగా నిలిచింది. 
 
ముఖ్యంగా, మోడల్ అయేషా, షోయబ్ దాదాపు ఒక సంవత్సరం క్రితం ఫోటో షూట్ కోసం ఒకరితో ఒకరు పనిచేశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అంటున్నారు. 
 
ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెటర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అయేషాను ప్రశంసించాడు. ఫోటో షూటింగ్ సమయంలో ఆమె తనకు చాలా సహాయం చేసిందని చెప్పింది. ఇక ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
 
అయేషా విషయానికి వస్తే, ఆమె పాకిస్థానీ నటి, ప్రముఖ యూట్యూబర్. ఆమె పాకిస్తాన్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. 41 ఏళ్ల ఆమె కొల్లేగే జీన్స్, కుచ్ లమ్హే జిందగీ కే, మేరీ జాత్ జరా ఈ బెనేషన్, దిల్ కో మనానా అయా నహీ, జిందగీ గుల్జార్ హై వంటి అనేక టెలివిజన్ సీరియల్స్‌లో ప్రముఖ పాత్రలు పోషించారు.
 
ఆమె 2015లో విజయవంతమైన రొమాంటిక్-కామెడీ 'కరాచీ సే లాహోర్'లో ప్రధాన పాత్రలో తన సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత యుద్ధ చిత్రం 'యల్ఘార్' (2017) డ్రామా 'కాఫ్ కంగనా' (2019)లో సహాయ పాత్రలు పోషించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments