Webdunia - Bharat's app for daily news and videos

Install App

అభిశంసన తీర్మానం తిరస్కృతి : 'సుప్రీం'ను ఆశ్రయిస్తామన్న కపిల్ సిబల్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను తొలిగించాలంటూ విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరస్కరించారు. దీన్ని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (16:11 IST)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను తొలిగించాలంటూ విపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానాన్ని సోమవారం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తిరస్కరించారు. దీన్ని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ ఈ అంశంపై మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులతో ప్రజాస్వామ్య అనుకూల శక్తులు పోరాడుతున్నాయన్నారు.
 
చీఫ్ జస్టిస్ అభిశంసన పిటిషన్‌ను తిరస్కరించిన అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐకి చెందిన 64 మంది ఎంపీలు, ఇటీవల పదవీ విరమణ చేసిన ఆరుగురు రాజ్యసభ మాజీ సభ్యులు సంతకాలు చేసిన అభిశంసన నోటీసును శుక్రవారం వెంకయ్యనాయుడుకు అందజేసిన విషయం తెలిసిందే. 
 
మూడు రోజుల పాటు ఆయన దీనిపై విస్తృత సంప్రదింపులు నిర్వహించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, న్యాయకోవిదుడు కె.పరాశరన్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ సెక్రటరీ పీకే మల్హోత్రా తదితరుల అభిప్రాయాలను వెంకయ్య తెలుసుకున్నారు. అలాగే, రాజ్యసభ సెక్రటేరియట్ సీనియర్ అధికారులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ సూచనలను కూడా తీసుకున్న తర్వాతే నోటీసును తిరస్కరించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments