ప్రత్యేక రాష్ట్రం సెగలు : అగ్నికి ఆజ్యం పోయొద్దంటున్న సీఎం కుమార

ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని 13 జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ సాగుతున్న ఉద్యమంపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం అగ్నికి ఆజ్యం ప

Webdunia
మంగళవారం, 31 జులై 2018 (14:11 IST)
ఉత్తర కర్ణాటక రాష్ట్రంలోని 13 జిల్లాలను కలుపుతూ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ సాగుతున్న ఉద్యమంపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి స్పందించారు. ప్రత్యేక రాష్ట్రం అగ్నికి ఆజ్యం పోయటానికి బదులుగా ఆత్మసాక్షి ప్రకారం మాధ్యమాలు విధుల్ని నిర్వర్తించాలని హితవు పలికారు. ప్రత్యేక రాష్ట్ర చిచ్చును ప్రసారమాధ్యమాలే రగిలిస్తున్నాయని మండిపడ్డారు.
 
భాజపా ఎమ్మెల్యే శ్రీరాములు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడారు. చెన్నపట్టణలో జరిగిన ఒక కార్యక్రమంలో దీన్ని ప్రస్తావించాను. ప్రత్యేక రాష్ట్రమైతే అభివృద్ధికి ఎక్కడి నుంచి ధనాన్ని తేవాలి? అని ప్రశ్నించాం. ఇది పెద్ద నేరమా? దీన్నే మాధ్యమాలు పదే పదే ప్రసారం చేసి.. జనాన్ని రెచ్చగొడుతున్నాయి అంటూ విమర్శించారు. 
 
మాధ్యమాలు ప్రజా ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నాయా అని ప్రశ్నించి నిర్మాణాత్మకంగా విధుల్ని నిర్వర్తించాలని సలహా ఇచ్చారు. రూ.2.18 లక్షల కోట్ల బడ్జెట్‌లో ఐదు జిల్లాలకు రూ.516 కోట్లు కేటాయించటం తప్పా? ఇకనైనా మాధ్యమాలు ప్రశ్నించుకోవాలని కోరారు. బెంగళూరు నగర అభివృద్ధిని ప్రభుత్వం అటకెక్కిస్తోందని మాధ్యమాలు చేస్తున్న ప్రచారం రాష్ట్రం బాగుకు ఉద్దేశించిందా? లేక వినాశనాన్ని ఆశించిందా? అని కుమార స్వామి విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments