Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిర్భయ దోషులకు 20న ఉదయం 5.30 గంటలకు ఉరి...

Webdunia
గురువారం, 5 మార్చి 2020 (14:55 IST)
నిర్భయ అత్యాచార కేసులో దోషులకు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్షలను అమలు చేయనున్నారు. 20వ తేదీ ఉదయం 5.30 ఉరి తీయాల్సిందిగా ఢిల్లీ పాటియాలా కోర్టు గురువారం డెత్ వారెంట్‌ను జారీచేసింది. దీంతో ఈ దఫా ఖచ్చితంగా ఉరిశిక్షలను అమలు చేయడం ఖాయమని తెలుస్తోంది. 
 
నిజానికి ఈ కేసులో దోషులుగా తేలిన పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్, అక్షయ్‌లు ఉరిశిక్షలను తప్పించుకునేందుకు న్యాయ వ్యవస్థలోని అన్ని లొసుగులను ఉపయోగించుకుని, తమ శిక్షలను వాయిదా వేస్తూ వచ్చారు. అలాగే, పదేపదే కోర్టులకు వెళ్లడం, క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేయడం, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లను సమర్పించుకోవడం ఇలా కాలయాపన చేస్తూ వచ్చారు. 
 
దీంతో పాటియాలా కోర్టు గతంలో మూడు సార్లు డెత్ వారెంట్లు జారీ చేసినప్పటికీ శిక్షలను అమలు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ నలుగురు దోషులకు పాటియాలా హౌస్‌ కోర్టు కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసింది. మార్చి 20వ తేదీన ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని పాటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేందర్ రానా ఆదేశాలు జారీ చేశారు. ఉరి శిక్షకు సంబంధించి తీహార్‌ జైల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే రెండు సార్లు నలుగురు నిందితులకు ఉరి శిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్వేతా మీనన్ అశ్లీల కంటెంట్‌ చిత్రంలో నటించారా? కేసు నమోదు

అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ ఫిల్మ్ ఘాటీ రిలీజ్ డేట్ ఫిక్స్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ సినిమా నుంచి ఓనమ్ లిరికల్ సాంగ్

Vijay Deverakonda: బెట్టింగ్ యాప్ గురించి క్లారిఫై ఇచ్చిన విజయ్ దేవరకొండ

రేణూ దేశాయ్ నటించిన బ్యాడ్ గాళ్స్ అమ్మోరులా వుంటుంది : డైరెక్టర్ మున్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

తర్వాతి కథనం
Show comments