Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇపా వైరస్ సోకితే.. జ్వరం, దగ్గు, కండరాల నొప్పులొస్తాయ్..

ఇపా వైరస్‌ సోకితే.. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన పందులు, గబ్బిలాలు, వాటి విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. ఇపా

Webdunia
శనివారం, 26 మే 2018 (12:47 IST)
ఇపా వైరస్‌ సోకితే.. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇన్ఫెక్షన్ సోకిన పందులు, గబ్బిలాలు, వాటి విసర్జితాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది. ఇపా వైరస్‌తో దేశ ప్రజలు జడుసుకుంటున్న వేళ.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. నివారణ చర్యలు చేపడుతున్నాయి. కానీ శుభ్రత పాటిస్తే... ఇపా వైరస్ బారిలో పడే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. 
 
చేతులను తరచుగా సోప్‌తో శుభ్రం చేసుకుంటూ, ఆహారాన్ని పూర్తిగా ఉడికించి తినడం, పండ్లను శుభ్రంగా కడిగిన తర్వాత తినడం ద్వారా వైరస్‌కు దూరంగా ఉండొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. నిపా వైరస్ జంతువుల నుంచి మనుషులకు సంక్రమించడం ద్వారా పెంపుడు జంతువులకు దూరంగా వుండాలి. కేరళలోని కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వేనాడ్ జిల్లాలకే ప్రస్తుతం నిపా వైరస్ పరిమితమైంది. 
 
దేశంలో మరెక్కడ దీని ఆనవాళ్లు లేవు. ఈ వైరస్ వ్యాధి బారిన పడిన వారి సమీపానికి వెళ్లినప్పుడు ఇతరులకు కూడా సోకే ప్రమాదం ఉందని, వారు ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేయడం ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని కోచిలోని అమ్రిత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ క్లినికల్ ప్రొఫెసర్ విద్యామీనన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments