Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లురు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం ఆ అరటి పండ్ల వ్యాపారిని చూసి అదిరిపోతోంది, ఎందుకో?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:38 IST)
నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డి పాళెంలో ఎస్కే జిలానీ పేరు మారుమోగిపోతోంది. ఇంతకీ అతడు చేసేది తోపుడు బండిపైన గత 40 ఏళ్లుగా అరటిపండ్ల వ్యాపారం. ఐతే ఇందులో వింతేముంది అనుకుంటున్నారు కదా... కానీ ఆ చిరు వ్యాపారి ఏకంగా రూ. 1.20 కోట్లు పెట్టి 108 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసాడు. అది కూడా నెల్లూరు జిల్లా ముంబై జాతీయ రహదారికి ఆనుకుని వున్న బస్టాండ్ సెంటర్ వద్ద వున్న షాపింగ్ కాంప్లెక్సులో. అక్కడే ఎందుకు కొనాల్సి వచ్చింది?
 
జిలానీ గత 40 ఏళ్లుగా ఇదే సెంటర్లో తోపుడు బండిపైన అరటిపండ్లు అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. ఐతే ఎన్నాళ్లగానో వున్న పాత కాంప్లెక్సున పడగొట్టి కొత్త కాంప్లెక్స్ నిర్మించాలని నిర్వాహకులు నిర్ణయించారు. దీనితో అక్కడే పాత కాంప్లెక్స్ వద్ద పండ్ల వ్యాపారాలను చేసుకునేవారిని మెల్లగా ఖాళీ చేయిస్తున్నారు.
 
ఇక తను కూడా ఇలాగే తన తోపుడు బండితో సహా ఆ ప్రదేశాన్ని వదిలిపోవాల్సి వస్తుందన్న భయంతో జిలానీ ధైర్యం చేశాడు. కొత్త కాంప్లెక్సులో కొంత స్థలాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లుగానే వేలంపాటలో ఆ కాంప్లెక్సులో 108 చదరపు అడుగుల స్థలాన్ని కోటీ 20 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇపుడు నెల్లూరు జిల్లా బుచ్చిలో ఇదే చెప్పుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments