Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ.. బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతాం : బాలయ్య ఫైర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ప్రధాని మోడీపై బాలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయ

Webdunia
శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (16:01 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. ఇంతకుముందెన్నడూ లేనివిధంగా ప్రధాని మోడీపై బాలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన నువ్వు ఒక ద్రోహివి... నిన్ను కొట్టి కొట్టి తరుముతామని, బంకర్‌లో దాక్కున్నా లాక్కొచ్చి బాదుతామంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు బీజేపీకి రెండు సీట్లు ఉండేవని... వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని బాలయ్య జోస్యం చెప్పారు.
 
ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని దేశానికి తెలియజేసేలా ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజైన శుక్రవారం (ఏప్రిల్ 20) ధర్మపోరాట దీక్షను విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో తలపెట్టిన విషయం తెల్సిందే. ఈ దీక్షకు బాలకృష్ణ తన సంఘీభావాన్ని తెలుపుతూ నరేంద్ర మోడీపై మండిపడ్డారు. 
 
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఎవరెవరినో అడ్డం పెట్టుకుని వ్యవహారాలని నడిపిస్తున్నావ్.. ఏపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు. చిల్లర రాజకీయాలు, కుప్పిగంతులు మానేయాని మోడీకి బాలయ్య సూచించారు. అమరావతి శంకుస్థాపనకు మట్టి, పవిత్ర జలాలను మోడీ తీసుకురావడం గురించి మాట్లాడుతూ... మా దగ్గర మట్టి, నీళ్లు లేవా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రతి ఆంధ్రుడు ఒక్కో 'గౌతమీపుత్ర శాతకర్ణి'లా మోడీపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీని ఉద్ధరించే శక్తి కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha and Raj: రాజ్ నిడిమోరుతో సమంత రూతు ప్రభు చెట్టాపట్టాల్

బాలీవుడ్ యువ నటుడు కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల డేటింగ్?

Sreeleela: డాక్టర్ కోడలు కావాలి.. కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమాయణం..

Soundarya: నటి సౌందర్యది హత్య.. ప్రమాదం కాదు.. మోహన్ బాబుపై ఫిర్యాదు

Kiran Abbavaram: యాభై మందిలో నేనొక్కడినే మిగిలా, అందుకే ఓ నిర్ణయం తీసుకున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించాలి?

ఎర్ర జామకాయ దొరికితే తినేయండి

మహిళలు రోజువారీ ఆహారంలో నువ్వులు చేర్చుకుంటే? ఎలా తీసుకోవాలి?

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

తర్వాతి కథనం
Show comments