ఆటోలో కూర్చుని టీ తాగుతూ మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా: ఏంటి సంగతి?

Webdunia
శనివారం, 19 మార్చి 2022 (19:38 IST)
రాజకీయాలలో వారిద్దరూ ఫైర్ బ్రాండ్స్. ఒకరు అధికార పార్టీలో అమాత్యుడు. మరోకరు ప్రతిపక్షంలో అత్యంత కీలక వ్యక్తి. రాష్ట్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించే మూడు సామాజిక వర్గాలలోని రెండింటికి వీరు ప్రతినిధులు. కాని ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. విధాన పరమైన నిర్ణయాల విషయంలో వీరిద్దరు శత్రువులే. కాని మంచి మిత్రులు.

 
వారి ఛాయాచిత్రాలను చూసినప్పుడు తెలుగు ప్రజలకు సంబంధించినంత వరకు వీరిని ఎవ్వరూ పరిచయం చేయనవసరం లేదు. వారిలో ఒకరు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) మరొకరు వంగవీటి రాధాకృష్ణ  (రాధా). రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు అని భావించే వీరిరువురు శనివారం గుడివాడలో కలిసారు. సీనియర్ రాజకీయ నాయకుడు అడపా వెంకట రమణ (బాబ్జి) ఆకస్మిక మృతి నేపధ్యంలో అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నివాళి అర్పించారు.

 
ఖాళీ సమయంలో ఇదిగో ఇలా అతి సాధారణంగా ఓ ఆటోలో కూర్చుని ఛాయ్ తాగుతూ కనిపించారు. గత కొంతకాలంగా కొడాలి నాని తన స్నేహితుడు రాధాను తన పార్టీలోకి తీసుకు రావాలని భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకుల కధనాలలో తరచుగా వినిపిస్తున్నమాట. కాని వీరిరువురూ ఈ విషయంపై నోరు మెదపరు. మౌనం వీడరు.

 
రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది జగమెరిగిన నానుడి. అదే నిజం కాబోతుందేమో. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుడివాడ తెలుగుదేశం నాయకులతో వంగవీటి ఇంతలా కలివిడిగా ఉన్న దృశ్యాలు మనకు కనిపించవు. ప్రతిపక్షంపై విరుచుకుపడే కొడాలికి, ఆ ప్రతిపక్షంలో క్రియాశీలకంగా వ్యవహరించే వంగవీటికి మధ్య ఉన్న ఈ అనుబంధం రేపటి రాష్ట్ర రాజకీయాల దిశాదశలను మార్చినా ఆశ్చర్యం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

Meghana Rajput: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్టీరియస్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments