ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్నారు.. విగ్రహాలకు పెళ్లి చేశారు.. ఎక్కడ?

Webdunia
గురువారం, 19 జనవరి 2023 (23:25 IST)
idols marriage
ప్రేమ పెళ్లితోనే సుఖాంతం అవుతుందని నమ్మే కాలం పోయింది. ప్రేమ కోసం త్యాగాలు చేసే వారి సంఖ్య కూడా కరువైంది. స్మార్ట్ ఫోన్ కాలం వచ్చేసింది. సోషల్ మీడియాలో ప్రేమించుకునే వారి సంఖ్య పెరిగింది. ఇలాంటి కాలంలోనే ప్రేమకు విలువనిచ్చే వారున్నారు. ఆ ప్రేమ కారణంగా ప్రాణాలు విడిచినా.. బుద్ధి తెలుసుకుని వారి విగ్రహాలకు పెళ్లి చేసిన పెద్దల వ్యవహారం గుజరాత్ లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ రాష్ట్రంలో గత ఆరు నెలల క్రితం తమ ప్రేమకు పెళ్లితో ముగింపు రాలేదని.. ఓ జంట బలవన్మరణానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆ జంటకు చెందిన విగ్రహాన్ని ప్రతిష్టించి పెళ్లి చేయడం జరిగింది. గుజరాత్‌లోని దాబీలో నివసించే గణేష్ అదే ప్రాంతానికి చెందిన రంజన అనే అమ్మాయిని ప్రేమించాడు.
 
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇంట్లో మాట్లాడుకున్నారు. అయితే కుటుంబ సభ్యులు ఇందుకు అంగీకరించకపోవడంతో గత ఆగస్టులో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 
 
వీరిద్దరి ఆత్మహత్యను జీర్ణించుకోలేని పెద్దలు పశ్చాత్తాపంతో  వారి విగ్రహాలను తయారు చేసి ఆ విగ్రహాలకు పెళ్లి చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇలా ఆ ప్రేమికుల ఆశ బతికుండగా జరగకపోయినా.. మరణానికి అనంతరం నెరవేరిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments