చెన్నైలో కలకలం : తొలి కరోనా స్ట్రైన్ తొలి పాజిటివ్ కేసు నమోదు!!

Webdunia
మంగళవారం, 22 డిశెంబరు 2020 (14:17 IST)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో కలకలం రేగింది. తొలి కరోనా స్ట్రైన్ కేసు నమోదైంది. బ్రిటన్ నుంచి చెన్నైకు వచ్చిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆ వ్యక్తిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, బ్రిటన్ నుంచి వచ్చిన మరికొంతమందిని ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. 
 
నిజానికి ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ హడలిపోతున్నారు. ముఖ్యంగా, అగ్రరాజ్యాలకు చెందిన ప్రజలు సైతం వణికిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ పుట్టుకొచ్చింది. పైగా, ఇది శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో బ్రిటన్ అంటేనే ఇతర దేశాల ప్రజలు హడలిపోతున్నారు. 
 
ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి ఢిల్లీ వచ్చిన సదరు వ్యక్తి అక్కడి నుంచి చెన్నై చేరుకున్నాడు. కరోనా సోకినట్టు తేలడంతో అతడిని క్వారంటైన్‌లో ఉంచారు. బ్రిటన్‌లో రూపాంతరం చెందిన కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ వ్యక్తి నుంచి నమూనాలు సేకరించి పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ఆ వ్యక్తికి సోకింది కరోనా కొత్త రకం వైరస్సా? కాదా? అనేది పరీక్షల అనంతరం వెల్లడి కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishwak Sen : విశ్వక్‌సేన్ # CULT పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ టీజర్

Yash: రక్తం పారుతుంటే మందు తాగుతూ టాక్సిక్ ద్వారా యశ్ ఏం చెబుతున్నాడు?

Dasharath: టీవీ, ఓటీటీ కంటెంట్ దర్శకుడు ఆర్య హీరోగా చిత్రం

Arjun: నాలుగు రోజుల్లో 8.7 కోట్ల గ్రాస్‌ను రాబట్టిన సీతా పయనం

Hebba Patel: మిరాకిల్ చేద్దాం రండి అంటున్న హెబ్బా పటేల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బైపాస్ సర్జరీ శాశ్వత పరిష్కారం కాదు, కొత్త బ్లాకేజీలపై అప్రమత్తత అవసరం

మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం కోసం పిపెయిర్‌ను విడుదల చేసిన జైడస్

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం వేసుకుని తాగితే?

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

తర్వాతి కథనం
Show comments