రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటు బాంబు పేలింది..

Webdunia
శనివారం, 11 ఫిబ్రవరి 2023 (12:30 IST)
bomb
ఇంగ్లండ్‌లోని నార్ ఫోల్క్ కౌంటీలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటు బాంబు పేలింది. రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును గుర్తించి డిప్యూజ్ చేస్తుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని వెల్లడించారు. 
 
నార్ ఫోల్క్ కౌంటీలోని గ్రేట్ యార్మౌత్ టౌన్‌లో పాతకాలం నాటి పేలని బాంబును అధికారులు గుర్తించారు. ఇలా గుర్తించిన బాంబులు డిప్యూజ్ చేయడానికి అధికారులు ప్రయత్నిస్తారు. డిప్యూజ్ చేయడం కుదరని సందర్భంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని బాంబును పేల్చేస్తారు. 
 
ఇదేవిధంగా మంగళవారం గుర్తించిన బాంబును డిప్యూజ్ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బాంబును గుర్తించిన చోట చుట్టుపక్కల ప్రదేశాల్లోని జనాలను అక్కడి నుంచి తరలించారు.
 
ట్రాఫిక్‌ను దారి మళ్లించి, రోబోలతో బాంబును డిప్యూజ్ చేయడానికి ఉపక్రమించారు. ఈ ప్రయత్నంలో బాంబు పేలిపోవడంతో భారీ విస్పోటనం జరిగిందని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anushka Shetty: స్వీటీ అనుష్క శెట్టి పెళ్లి చేసుకుంటుందా?

Ustaad Bhagat Singh: ఎంటర్ టైన్ మెంట్, దేశభక్తి కలగలిపిన ట్రైలర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ఆకట్టుకున్నాడు

మేడ్ ఇన్ కొరియా చిత్రీకరణ ఆనందించదగ్గ అనుభవం : ప్రియాంక మోహన్.

S.P. Charan: ఎస్పీ చరణ్, కేఎస్ చిత్ర పాడిన మెలోడీ బంగారు బొమ్మ సాంగ్ రిలీజ్

Rashmika: విజయ్ దేవరకొండ కోసం పోరాటం చేసిన రష్మిక మందన్న వీడియో రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీర మర్దనకు ఎలాంటి నూనెలు వాడాలి?

పొట్ట మసాజ్, ప్రయోజనాలు ఏమిటి?

డయాబెటిస్‌, గుండె, మూత్రపిండాల ప్రమాదాలను ముందస్తుగా గుర్తించడానికి అబోట్ ICRAS సాధనం

నల్ల ద్రాక్షలో వున్న పోషకాలు ఏమిటి? వాటి ప్రయోజనాలు ఏమిటి?

అల్లంతో గృహవైద్యం అంటారు, ఎందుకు?

తర్వాతి కథనం
Show comments