ఇన్‌స్టాగ్రామ్‌లో మహేష్ బాబు అరుదైన ఫోటో.. నమ్రతకు లిప్ కిస్ ఇస్తూ..
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోషల్ మీడియాలో అరుదైన ఫోటోను పోస్టు చేశాడు. ''భరత్ అనే నేను'' సినిమా సక్సెస్ కావడంతో.. ఖుషీ ఖుషీగా వున్న మహేష్ బాబు.. తన భార్య నమ్రతకు లిప్ కిస్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సోషల్ మీడియాలో అరుదైన ఫోటోను పోస్టు చేశాడు. ''భరత్ అనే నేను'' సినిమా సక్సెస్ కావడంతో.. ఖుషీ ఖుషీగా వున్న మహేష్ బాబు.. తన భార్య నమ్రతకు లిప్ కిస్ చేస్తున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఈ ఫోటోకు ''థ్యాంక్యూ మై లవ్'' అనే క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఫోటోకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్ల స్పందన సూపర్‌గా వుంది. ఇంతకుముందెప్పుడు మహేష్‌ను ఇలా చూడలేదని.. సో క్యూట్ అంటూ.. ఇది ఎంతో అందమైన ఫోటో అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫొటోకు ఫిదా అయిపోయామని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ''భరత్ అనే నేను" బాక్సాఫీసు రికార్డులు బ్రేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కైరా అద్వానీ మహేష్ సరసన నటించిన సంగతి తెలిసిందే. ఇంకేముంది.. నమ్రతకు లిప్ కిస్ ఇచ్చిన మహేష్ ఫోటోను ఓ లుక్కేయండి.