Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు తెలియకుండా రెండు టమోటాలు వాడాడు.. భర్త పరిస్థితి ఏమైందంటే?

Webdunia
గురువారం, 13 జులై 2023 (09:26 IST)
టమోటా ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. టమోటాలు కొనాలంటే జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఇక టమోటా ధరలకు సామాన్యులు తలపట్టుకుని కూర్చుంటే.. ఈ టమోటా ధరలతో ఓ కుటుంబం విడిపోయింది. భార్యకు తెలియకుండా వంటలో రెండు టమాటాలు వాడిన ఓ వ్యక్తి కాపురం కూలిపోయింది. 
 
భర్తపై మండిపడ్డ ఆ ఇల్లాలు తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లాలో తాజాగా ఈ ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. సంజీవ్ బర్మన్ అనే వ్యక్తి ఓ టిఫిన్ సెంటర్ నడుపుతున్నాడు. అతనికి భార్య పిల్లలు వున్నారు. 
 
ఇటీవల భార్యకు తెలియకుండా వంటలో రెండు టమోటాలు ఎక్కువ వాడేశాడు. అంతే భార్యకు ఈ విషయం తెలిసిపోయింది. ఆమె కోపంతో ఊగిపోయింది. అంతే ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె తన పిల్లల్ని తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది. 
 
భార్య కోసం చుట్టుపక్కల వెతికినా ఉపయోగం లేకపోవడంతో సంజీవ్ చివరకు పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments