Work From Home పెద్ద గుదిబండ: 90 శాతం మంది ఉద్యోగులకి అలాంటి ఇబ్బంది

Webdunia
సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (22:14 IST)
కరోనావైరస్ దెబ్బకి చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్నిచ్చాయి. మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే హాయిగా ఇంట్లోనే పిల్లాపాపల మధ్య ఫ్యాను కింద కూర్చుని పనిచేసుకోవచ్చులే అనుకున్నవారంతా ఇప్పుడు, ఆఫీసుకు ఎపుడెపుడు వెళ్దామా అని అనుకుంటున్నారు. దీనికి కారణం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవారిలో 90 శాతం మందికి పలు అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయట. ఈ విషయాన్ని హర్మన్ మిల్లర్ అనే ఆఫీస్ ఫర్నీచర్ తయారీ సంస్థ సర్వే చేసిన పిదప తెలియజేసింది.
 
లాక్ డౌన్ విధించిన తర్వాత సాధారణ పనిగంటలు పెరిగిపోయాయి. కనీసం 20 శాతం మేర అధికంగా కూర్చుని పనిచేస్తున్నట్లు తేలింది. ఫలితంగా 90 శాతం మందిలో మానసిక ఒత్తిడి, శారీరక నొప్పులతో సతమతం అవుతున్నారట.
 
ఇంకా 39.4 శాతం మందికి మెడనొప్పి ఇబ్బందిపెడుతుంటే 53 శాతం నడుము నొప్పితో సతమతం అవుతున్నారట. 44 శాతం మందికి రాత్రిపూట నిద్రపట్టక గిలగిలలాడుతున్నట్లు తేలింది. 34 శాతం మంది చేతుల నొప్పులు, 33 శాతం మంది కాళ్లనొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. సుమారు 27 శాతం మంది తలనొప్పి, కళ్లు లాగటం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మొత్తమ్మీద లాక్ డౌన్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉద్యోగులకు గుదిబండలా మారిందని సర్వేలో తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments