Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల కపిలేశ్వర ఆలయంలో ఆడుకుంటున్న చిరుతపులులు (video)

Webdunia
బుధవారం, 19 మే 2021 (11:57 IST)
తిరుపతిలోని కపిలేశ్వర ఆలయంలో చిరుతపులుల సంచారం కలకలరేపుతోంది. రెండు చిరుత పులులు ఆలయంలో తిరుగుతూ కనిపించాయి. ఈ దృశ్యాలన్నీ మొత్తం సి.సి.టీవీలో రికార్డయ్యాయి. అయితే కరోనా కారణంగా ఆలయాన్ని మూసివేయడంతో నిర్మానుషంగా ఉన్న కారణంగా చిరుతలు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది భావిస్తున్నారు.
 
కరోనా కారణంగా తిరుమలలో క్రమేపీ భక్తుల సంఖ్య తగ్గుతుంటే స్థానిక ఆలయాల్లో అయితే భక్తులే కనిపించడం లేదు. అందులోను స్థానిక ఆలయాలను ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు తెరిచి ఉండడంతో భక్తులు తక్కువ సంఖ్యలో దర్సనం చేసుకుంటున్నారు. 
 
ఆ తర్వాత భక్తులు లేకపోవడంతో ఆలయాలన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. అందులోను టిటిడి ఆధ్వర్యంలో నడుపబడే తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం సరిగ్గా శేషాచలం అడవులకు సమీపంలో ఉంది. శేషాచలం అడవుల్లో చిరుత పులల సంచారం ఎప్పటి నుంచో ఉంది. నిర్మానుషంగా ఉండటంతో చిరుత పులులు ఇష్టానుసారం జనం తిరిగే ప్రాంతంలోకే వచ్చేస్తున్నాయి.
 
కపిలేశ్వర ఆలయంలో కూడా రాత్రి 7 గంటల సమయంలో రెండు చిరుతపులులు వచ్చినట్లు టిటిడి సెక్యూరిటీ సిబ్బంది సిసి కెమెరాల ద్వారా గుర్తించారు. అక్కడున్న టిటిడి సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. అయితే అప్పటికే చిరుతలు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. కానీ మొట్టమొదటి సారి ఆలయంలోకి చిరుతలు రావడం ఇదే ప్రధమమంటున్నారు టిటిడి అధికారులు. 

 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments