Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానంలో ప్రయాణీకుడికి వైద్యం అందించిన డాక్టర్.. ఏమైందంటే?

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (15:19 IST)
కొచ్చి నుండి ముంబైకి వెళ్లే ఆకాసా ఎయిర్ విమానంలో డాక్టర్ సిరియాక్ ఏబీ ఫిలిప్స్ అనే ప్రయాణికుడు శ్వాసకోశ బాధను ఎదుర్కొంటున్న తోటి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడి హీరోగా ఎదిగాడు. జనవరి 14 రాత్రి జరిగిన ఈ సంఘటన, వైద్యుడి త్వరిత వైద్యంతో ఇంటర్నెట్‌లో  ప్రశంసలను పొందేలా చేసింది. 
 
ఈ సందర్భంగా డాక్టర్ ఫిలిప్స్ మాట్లాడుతూ.. సహ-ప్రయాణికుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు చర్య తీసుకోవలసి వచ్చింది. ఎమర్జెన్సీ నెబ్యులైజర్‌తో ఎయిర్ హోస్టెస్‌కు సహాయం చేస్తూ, ఆ వ్యక్తి పరిస్థితిని గమనించి వైద్యం అందించినట్లు తెలిపారు.

తన స్టెతస్కోప్‌ని ఉపయోగించి, ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడాన్ని సూచించే ప్లూరల్ ఎఫ్యూషన్ అని పిలవబడే ఒక తీవ్రమైన పరిస్థితిని గుర్తించడానికి బాధ్యత వహించాను. అలాగే ఆ ప్రయాణీకుడి అధిక రక్తపోటు 280/160 స్థాయికి చేరుకుంది. దీంతో ఇంజెక్షన్ ఇచ్చి.. విమానంలో ఎదురైన సవాల్‌ను ఎదుర్కొన్నట్లు తెలిపారు.

అయితే అవసరమైన ఆక్సిజన్, ఇతరత్రా సహాయాన్ని అందించినందుకు అకాసా ఎయిర్ సహాయక సిబ్బందిని ప్రశంసించారు. ప్రస్తుతం ఈ వైద్యుడిని ఇంటర్నెట్ జనం ప్రశంసలతో ముంచెత్తారు. ఇంకా అకాసా ఎయిర్ సహాయక సిబ్బందిని కూడా కొనియాడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments