Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిద్ధరామయ్య... అప్పుడు చెయ్యి పట్టుకున్నాడు... ఇప్పుడు చున్నీ లాగాడు

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (20:23 IST)
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరోసారి తన అనుచిత ప్రవర్తన బయటపెట్టారు. తమ సమస్యలు పరిష్కరించడంలో వైఫల్యం చెందారంటూ ఓ మహిళ ఆగ్రహంతో తన ముందు మాట్లాడటాన్ని ఓర్చుకోలేని సిద్ధు ఏకంగా ఆమె చున్నీ పట్టుకుని లాగేశారు. మైకును కూడా లాగేశారు. ఈ వ్యవహారం కాస్తా ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది. దేశమంతా ఇప్పుడు ఈ వీడియోను షేర్ చేసుకుంటూ సిద్ధరామయ్యకు శాపనార్థాలు పెడుతున్నారు మహిళలు.
 
కాగా కర్ణాటకలోని వరుణ అసెంబ్లీ నియోజకవర్గంలో సమస్యలు ఏమయినా తన దృష్టికి తీసుకురావాలంటూ అక్కడికి వెళ్లారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో జనం పెద్దసంఖ్యలో అక్కడికి వచ్చారు. ఐతే కొంతమంది మహిళలు తమ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వారిలో జమలా రాణి అనే మహిళ సిద్దరామయ్య దృష్టికి తీసుకెళ్తూ గట్టిగా నిలదీసింది. దాంతో కోపంతో సిద్ధరామయ్య చున్నీ లాగేశారు. 
 
కాగా అప్పట్లో ఓ కళాశాల ఫంక్షనుకు వెళ్లినప్పుడు ఓ యువతి సెల్ఫీ తీసుకోవాలని చూస్తుండగా ఆమె చేయి పట్టుకుని గబుక్కున తనకు దగ్గరగా లాక్కుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు చున్నీ లాగేశారు. మరి ఇలాంటి నాయకుడిని పార్టీ నుంచి గెంటి వేస్తారా అంటూ పలువురు రాహుల్ గాంధీని సోషల్ నెట్వర్కింగ్ సైట్ల ద్వారా ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్ : శ్రీతేజ్‌‍ను పరామర్శించిన పుష్పరాజ్! (Video)

అగాతియా నుంచి జీవా, రాశి ఖన్నాలపై ఫస్ట్ సింగిల్ గాలి ఊయలలో.. రిలీజ్

సినీ జర్నలిజాన్నే గౌరవంగా భావించి ఎదిగిన బి ఏ రాజు- 65వ జయంతి

గేమ్ చేంజర్ నా ఆలోచనాధోరణి మార్చింది - చిరంజీవి ప్రశంస నేషనల్ అవార్డు : అంజలి

సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లో కథ చెప్పేసిన అనిల్ రావిపూడి - ప్రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments