Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ, మగ కాని వాళ్లకు కూడా మీసాలుంటాయి: జేసీ దివాకర్ ఎద్దేవా

ప్రబోధానంద స్వామి ఆశ్రమం వివాదం కాస్త ముదురుతోంది. అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ పోలీసులుగా మారిపోయింది. తమను కించపరిస్తే నాలుక కోస్తామంటూ సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ ఎంపీ జేస

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:10 IST)
ప్రబోధానంద స్వామి ఆశ్రమం వివాదం కాస్త ముదురుతోంది. అనంతపురం జిల్లాలో జేసీ దివాకర్ రెడ్డి వర్సెస్ పోలీసులుగా మారిపోయింది. తమను కించపరిస్తే నాలుక కోస్తామంటూ సీఐ మాధవ్ చేసిన వ్యాఖ్యల పట్ల టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఘాటుగా స్పందించారు.


పలనావాడు కొజ్జా అంటూ తాను ఏ ఒక్కరి పేరును ఉచ్చరించలేదని తెలిపారు. అయినా కొజ్జా అనే పదంలో తప్పేముందని మీడియాను ప్రశ్నించారు. కొజ్జా అనే పదం తప్పైతే క్షమాపణ చెప్పడానికైనా.. పోలీసుల కాళ్లు పట్టుకొని పాదాభివందనం చేసేందుకు సిద్ధమని తెలిపారు.
 
ఏపీ పోలీసు అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి, సీఐ మాధవ్ తన చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేశాడో ఆయనకే బాగా తెలుసని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ మీసాలు తిప్పాడని, ఆడ, మగ కాని వాళ్లకు కూడా మీసాలు ఉంటాయని ఎద్దేవా చేశారు. మాధవ్‌పై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ప్రబోధానంద స్వామి ఆశ్రమం వద్ద అల్లర్లు జరుగుతుంటే.. అంతమంది పోలీసులుండి, ఆయుధాలు పెట్టుకున్నా ఏమీ చేయలేకపోయారని జేసీ విమర్శలు గుప్పించారు. 
 
ఇదేమైనా సాయికుమార్ సినిమానా మీసాలు తిప్పడానికని సీఐని ఉద్దేశించి జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రియల్ లైఫ్ వేరు, సినిమాలు వేరని చెప్పారు. నన్నే హెచ్చరించే అంత మగాడివా? అంటూ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంటికి రావాలా? మీ పోలీస్ స్టేషన్‌కు రావాలా? అనంతపూర్ క్లాక్ టవర్ వద్దకు రావాలా? లేదా మీ ఊరికి రావాలా? చెప్పు? అంటూ సవాల్ విసిరారు. 'నాలుకే కోయాలనుకుంటే వచ్చి కోసేయ్... నీ కత్తి ఎంత పదునుగా ఉందో చూస్తా' అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments