Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా హీరో ఆయనే... అన్నయ్యను అంటే కొట్టేంత కోపం వస్తుంది : పవన్

కోట్లాది మంది అభిమానులకు అన్నయ్య ఎలా హీరోనే.. నాకు కూడా ఆయనే హీరోనని, ఆయన్ను మాత్రం ఎవరైనా ఒక్కమాట అంటే మాత్రం కొట్టేంత కోపం వస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అదేసమయంలో తనను ఎన్ని మా

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (15:39 IST)
కోట్లాది మంది అభిమానులకు అన్నయ్య ఎలా హీరోనే.. నాకు కూడా ఆయనే హీరోనని, ఆయన్ను మాత్రం ఎవరైనా ఒక్కమాట అంటే మాత్రం కొట్టేంత కోపం వస్తుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అదేసమయంలో తనను ఎన్ని మాటలు అన్నా తాను భరిస్తానని చెప్పారు.
 
అఖిల భారత చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు స్వామినాయుడితో పాటు పలువురు ముఖ్యనేతలు సోమవారమిక్కడ గచ్చిబౌలిలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ, జనసేన పార్టీ చిరంజీవి అభిమానులది. నా ఒక్కడిది కాదు. ఆయన అభిమానుల్లో నేనూ ఒకడిని. నాకు ఒక్కరే హీరో. ఆయనే చిరంజీవి అని అన్నారు. 
 
తనకు తాను ఎప్పుడూ హీరోగా భావించుకోలేదని, తన అన్నయ్యకు ఎప్పటికీ అభిమానిగానే ఉండిపోతానని చెప్పారు. తనను ఎవరు ఎన్ని మాటలన్నా కోపం రాదని, చిరంజీవి గురించి మాట్లాడితే వెళ్లి కొట్టేంత కోపం వస్తుందన్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వెళ్లారని తెలిపారు.
 
ఇకపోతే, ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ల మధ్య భిన్నమైన భావనలు, వ్యక్తిత్వాలు, ఆలోనలు ఉండడంలో తప్పులేదు. కొందరు వాటిని అర్థం చేసుకోకుండా స్పర్థలని ప్రచారం చేస్తున్నాన్నారు. నాదెప్పుడూ శాంతి మంత్రమే. గొడవకు సిద్ధంగా ఉండను. పదేళ్ల పాటు నా సినిమాలు విజయం సాధించకపోయినా అభిమానుల ప్రేమతో మాత్రమే బతికానని గుర్తు చేశారు. అదేసమయంలో సామాజిక, రాజకీయ మార్పు కోసం పుట్టిందే జనసేన అని మరోమారు పవన్ స్పష్టంచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments