Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రుడిపై 4జీ, 5జీ నెట్వర్క్‌లకు ఏర్పాటు, నాసాతో డీల్ కుదుర్చుకున్న నోకియా

Webdunia
సోమవారం, 19 అక్టోబరు 2020 (13:22 IST)
వినేందుకు కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇకమీదట చంద్రుడి మీదకు వెళ్లే వాళ్లు తమ స్మార్ట్ పోన్లను తీసుకెళ్లి అక్కడి నుంచి వాడుకోవచ్చు. చంద్రుడిపై మొబైల్ ఫోన్ నెట్ వర్క్‌ను ఏర్పాటు చేయాలని, అది కూడా 4జీ, 5జీ తరంగాల కమ్యూనికేషన్ నెట్వర్క్‌గా ఉండాలని భావిస్తున్న నాసా (అమెరికా అంతరి పరిశోధన సంస్థ) అందుకోసం ప్రముఖ టెలీ సంస్థ నోకియాతో డీల్ కుదుర్చుకుంది.
 
ఇందులో భాగంగా చందమామపై 4జి సెల్యులర్ నెట్వర్క్‌ను నోకియా ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 14.1 మిలియన్ డాలర్ల నిధిని అందించనుంది. తొలుత చందమామపై 4జీఎల్జీఈ నెట్వర్క్‌ను ఏర్పాటు చేయనున్న నోకియా తదుపరి దశలో దానిని 5జీకి అప్‌గ్రేడ్ చేయనుంది. ఈ వ్యవస్థ అభివృద్ధి చెందితే చంద్రుడి ఉపరితలంపై సమాచార మార్పిడి మరింత వేగవంతమవుతుందని, దీంతో మరింత విశ్వనీయ సమాచారాన్ని ఎప్పటికప్పడు పొందవచ్చని నాసా వ్యాఖ్యానించింది.
 
మరో 8 సంవత్సరాలలో అనగా 2028లో చంద్రుడిపై ఓ స్థావరాన్ని ఏర్పాటు చేసుకునే లక్ష్యాన్ని గతంలోనే నిర్థేశించుకున్న నాసా అందుకు తగ్గట్టుగా తన ప్రణాళికను రూపొందిస్తోందని కార్యనిర్వాహక ప్రతినిధి జిమ్ బ్రిడెన్ స్వైన్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

వారం రోజులుగా నిద్రలేని రాత్రులే గడుపుతున్నా : సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments