Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్టుకున్న భార్యను హత్య చేసాడు, గుట్టు బైటపడుతుందని లింక్ పెట్టుకున్న ప్రేయసి ఆత్మహత్య

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (14:27 IST)
ఖమ్మం జిల్లాలో కట్టుకున్న భార్య నవ్యారెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు దర్యాప్తులో వుండగానే మరో యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. సూసైడ్ చేసుకున్న యువతి నాగశేషురెడ్డి ఇద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
 
శేషురెడ్డి ఈ యువతితో ఫోనులో తరచూ మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దీనితో ఆమె ఫోనును స్వాధీనం చేసుకున్నారు. ఇక తమ మధ్య వున్న ప్రేమ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందోనని ఆ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమ్మీద ఇటు కట్టుకున్న భార్యను 2 నెలలు కూడా తిరగకుండానే హత్య చేసాడు. మరోవైపు ప్రేమించిన అమ్మాయి చావుకి కారణమయ్యాడని స్థానికులు మండిపడుతున్నారు.
 
కాగా ఖమ్మం​ జిల్లాలోని పెనుబల్లి మండలం కొత్త లంకపల్లిలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత దారుణ హత్యకు గురైంది. భర్తే.. భార్యను దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. మృతురాలు ఎర్రమల్ల నవ్య రెడ్డి (22)గా పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ఏర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో నవ్యరెడ్డి కనబడటం లేదని మిస్సింగ్ కేసు నమోదయింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే మిస్సింగ్ కేసు పెట్టింది కూడా భర్తే.
 
మిస్సింగ్‌లో భాగంగా పోలీసులు విచారణ చేస్తుండగా.. శుక్రవారం కుక్కల గుట్ట సమీపంలో నవ్యరెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నవ్యరెడ్డిని భర్త బైక్ పైన తీసుకువెళ్తున్న సీసీటివి ఫుటేజ్‌ని పోలీసులు సేకరించి చూడగా నవ్యను హత్య చేసింది స్వయంగా భర్తే అని తేలింది.
 
దీనితో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడితో పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. రెండు నెలల క్రితం నాగశేషు రెడ్డితో నవ్యరెడ్డికి వివాహం జరిగింది. ఇద్దరిది మధిర మండలం ఏర్రుపాలెం గ్రామం. నవ్యరెడ్డి సత్తుపల్లిలో సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజిలో బిటెక్ రెండవ సంవత్సరం చదువుతు ఉండగా... నాగశేషురెడ్డి బెంగుళూర్‌లో ఉద్యోగం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments