Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ షోలో నానికి ప్రజలు ఎన్ని మార్కులేశారో తెలిస్తే షాకే..

కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో రెండో సీజన్ ఆదివారం రాత్రి మొదలయింది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. జూనియర్

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (19:54 IST)
కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ షో రెండో సీజన్ ఆదివారం రాత్రి మొదలయింది. నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షోపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేసిన మొదటి సీజన్ తెలుగు ప్రేక్షకులను బిగ్ బాస్ షో దగ్గర చేసింది. అదే అంచనాలతో బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభమైంది. మొత్తం 16 మంది బిగ్ హౌస్ సభ్యులను ఇంటిలోకి పంపించే ఎపిసోడ్ను నాని బాగానే నిర్వహించగలిగారు. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో పోల్చుకుంటే అంత కళ, ఉత్సాహం కనిపించకున్నా ఫర్వాలేదనిపించేలా నాని మొదటి ఎపిసోడ్‌ను పూర్తిచేశారు. ఇక బిగ్ బాస్ హౌస్ విషయానికొస్తే… మొదటి సీజన్ ఇంటికంటే చాలా విశాలంగా, అత్యంత విలాసవంతంగా కనిపిస్తోంది. మొదటి సీజన్లో ఉన్నట్టే స్విమ్మింగ్ పూల్, జిమ్, లాన్, కిచెన్, లివింగ్ రూమ్, బెడ్ రూమ్, బాత్రూమ్స్ ఉన్నాయి. అదనంగా ఒక జైలు కూడా ఇంటిలోపల ఏర్పాటు చేశారు. 
 
మొదటిరోజు ఎలిమినేట్ చేయాలనుకున్నా ఇద్దరిని ఆ జైలులోకి పంపించారు. అంటే ఈ సీజన్లో జైలు కూడా ప్రధాన పాత్ర పోషించేలా కనిపిస్తోంది. మొదటి సీజన్లో కెప్టెన్‌కి ప్రత్యేక బెడ్ మాత్రమే ఏర్పాటు చేయగా… ఈసారి బెడ్ రూమ్ ప్రత్యేకంగా రూపొందించారు.
 
ఈ సీజన్లో ఎంపిక చేసిన సభ్యుల నేపథ్యం చాలా ఆసక్తిదాయకంగా ఉంది. బాబు గోగినేని కూడా ఒక సభ్యుడిగా ఉండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎలాంటి హేతుబద్ధత లేకుండా సాగే ఈ షోలో హేతువాది బాబు గోగినేని ఎలా ఉండగలుగుతారు అనేది ఆసక్తిదాయకంగా ఉంది. మొదటిరోజే ఇద్దర్ని ఎలిమినేట్ చేయడానికి పేర్లు సూచించమని బిగ్బాస్ అడిగితే… ఎంతసేపటికి ఇంటిలోకి వచ్చిన కొంతసేపటికే ఎవరి గురించి ఏమీ తెలియకుండానే ఇద్దర్ని ఎలిమినేట్ చేయడానికి పేర్లు నామినేట్ చెయ్యమంటే ఎలా చేస్తామంటూ బాబు గోగినేని ప్రశ్నించారు. హేతుబద్ధత లేకుండా ఏదైనా చేయాల్సిన అవసరం లేదని, మనం ఏమీ ఇక్కడ బానిసలం కాదని బాబు గోగినేని అన్నారు. అవసరమైతే తిరుగుబాటు చేసి బిగ్ బాస్ షో నిబంధలను మార్చమని తోటి సభ్యులతో ఆయన చెప్పడం భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకు సూచికగా… కనిపిస్తోంది. 
 
బాబు గోగినేని ఎంతకాలం హౌస్ లోపల ఉంటారో తెలియదు గాని బయటికి వచ్చిన తర్వాత కచ్చితంగా బిగ్బాస్ షో పైన తనదైన శైలిలో విశ్లేషణ చేసే అవకాశాలున్నాయి. ప్రతిదానిలోనూ చట్టాలు, హేతుబద్ధత గురించి మాట్లాడే ఆయన బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి అంశాలను లేవనెత్తుతారో చూడాలి. ఇక 11 నెలల పసిబిడ్డ కలిగిన తల్లిని కూడా సభ్యురాలుగా ఇంట్లోకి పంపించారు. బిడ్డ ఇంటివద్ద ఉంటే తల్లి బిగ్ హౌస్‌లో ఉంటుంది. సెలబ్రిటీలతో పాటు ఇద్దరు సామాన్యులను కూడా హౌసులోకి పంపించారు. సెలబ్రిటీలు, సామాన్యులు కలిసి ఎలా జీవించబోతున్నారు అనేది రోజువారి జరిగే ఎపిసోడ్లలో చూడాల్సిందే. టీవీ9 యాంకర్ దీప్తి ఒక సభ్యురాలుగా ఉన్నారు. ఇంటి లోపల స్టింగ్ ఆపరేషన్ లాంటివి చేయరు కదా అని నాని ఆమెను ఇంటికి వెళ్లేటప్పుడు సరదాగా ప్రశ్నించారు. సింగర్ గీతామాధురి, మాటల్లోనే పాటగా మార్చి పాప్ సింగర్ వంటివాళ్లు సభ్యులుగా ఉండటంవల్ల వినోదం బాగానే ఉండొచ్చు. 
 
అందరికన్నా చిన్న వయస్కురాలుగా యూట్యూబ్లో సెలబ్రిటీల మారిన అమ్మాయిని ఎంపిక చేసి ఇంటిలోకి పంపించారు. ఆమె పాత్ర ఎలా ఉండబోతోందన్న కూడా ఆసక్తిదాయకంగా ఉంది. బిగ్ బాస్ షో రెండో సీజన్ థీమ్ సాంగ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదటి సీజన్ మ్యూజిక్‌ని కొనసాగిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొదటి సీజన్ మ్యూజిక్ ప్రేక్షకుణ్ని ఉత్కంఠకు గురిచేసేలా ఉండేది. ఈ రెండో సీజన్ మ్యూజిక్‌లో అటువంటి శక్తి కనిపించడం లేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venkatesh : ఆర్‌ఎఫ్‌సీలో సంక్రాంతి స్పెషల్ సాంగ్ షూటింగ్

మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి

బెనెగల్ చిత్రాలు భారత సంస్కృతి సంపద : చిరంజీవి

బెంగాలీ దర్శకుడు శ్యామ్ బెనెగల్ కన్నుమూత

Peelings: పీలింగ్స్ పాటలో అల్లు అర్జున్ ఎత్తుకుంటే భయమేసింది.. అసౌకర్యంగా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

తర్వాతి కథనం
Show comments