Webdunia - Bharat's app for daily news and videos

Install App

#GSAT6A : జీఎస్ఎల్వీ ఎఫ్-08 ప్రయోగం సక్సెస్.. ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు (Video)

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ప్రయోగ కేంద్రం షార్ సెంటర్ నుంచి గురువారం జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 08 రాకెట్‌‌ విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జీశాట్‌-

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (17:31 IST)
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన ప్రయోగ కేంద్రం షార్ సెంటర్ నుంచి గురువారం జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 08 రాకెట్‌‌ విజయవంతంగా ప్రయోగించారు. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ జీశాట్‌-6ఏ నిర్ధేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. గురువారం సాయంత్రం 4.56 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌ నుంచి జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళ్లిన జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌08 రాకెట్.. 17 నిమిషాల 46 సెకన్ల వ్యవధిలో నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. 
 
ఈ ప్రయోగం విజయవంతంకావడంతో ఆయనతో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగం తర్వాత ఇస్రో ఛైర్మన్‌ కె.శివన్ ప్రతి శాస్త్రవేత్తను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. జీశాట్-6ఏ ఉపగ్రహం జీశాట్-6ను పోలి ఉంటుందని, అయితే ఇందులో కొన్ని మార్పులు చేశామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో స్వదేశీ క్రయోజనిక్ వ్యవస్థపై ఇస్రో పట్టుసాధించనట్టయింది. 
 
దీనివల్ల కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ శాటిలైట్ పదేళ్ళ పాటు సేవలు అందించనుంది. దీని బరువు 2130 కేజీలు. ఈ ఉపగ్రహంలో 5ఎస్, 1సి బాండ్ బీమ్‌లను అమర్చారు. ఈ ప్రయోగం విజయవంతంకావడం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments