Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆఫ్రికా దేశంలో మరో కొత్త వైరస్ - ఇద్దరి మృతి

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (08:44 IST)
ప్రపంచాన్ని వివిధ రకాల కొత్త వైరస్‌లు వణికిస్తున్నాయి. తాజాగా మరో కొత్త వైరస్ పురుడు పోసుకుంది. ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఘనాలో ఈ వైరస్ వెలుగు చూసింది. దీనికి మర్‌బర్గ్ అనే పేరు పెట్టారు. ఈ వైరస్ సోకిన ఇద్దరు వ్యక్తులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రజలతో పాటు వైద్య నిపుణులు ఉలిక్కిపాటుకు గురవుతున్నారు. 
 
ఇది ఎబోలా తరహా లక్షణాలు కలిగిన వైరస్‌ కారణంగా ఈనెల మొదట్లోనే ఆ ఇద్దరు మృతిచెందారు. కాగా ఆసుపత్రిలో చనిపోయే ముందు వారు డయేరియా, జ్వరం, వికారం, వాంతులు లాంటి లక్షణాలతో బాధపడినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మృతుల నమూనాలు సేకరించి సెనెగల్‌లోని ప్రయోగశాలలో పరీక్షలు నిర్వహించిన తర్వాత మర్‌బర్గ్‌గా తేలినట్లు ఘనా హెల్త్ సర్వీస్ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ధ్రువీకరించింది. కాగా అప్రమత్తమైన ఘనా ప్రభుత్వం కట్టడి చర్యలు చేపట్టింది. అనుమానితులు, క్లోజ్‌ కాంటాక్ట్‌లను ఐసోలేషన్‌కు తరలించి వారిని పరీక్షిస్తోంది. 
 
ఇదిలావుంటే, ఎబోలా కుటుంబానికి చెందిన మర్‌బర్గ్‌ వైరస్ ఓ అంటువ్యాధి. ఇది గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుంది. ఆ తర్వాత మానవుల్లో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్‌ సోకిన వ్యక్తి శారీరక ద్రవాలు తాకినప్పుడు లేదా దగ్గర సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఒకరినుంచి మరొకరికి సోకే అవకాశాలుఉన్నాయి. ప్రాణాంతకమైన ఈ వైరస్‌ 2-21 రోజులపాటు ఓ వ్యక్తిలో సజీవంగా ఉంటుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

ప్రణయగోదారి ఫస్ట్ లుక్ మంచి ఫీల్ కలిగిస్తుంది : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం